Dont do these after a Facial : ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లేముందు చాలామంది అమ్మాయిలు పార్లర్‌కి వెళ్తారు. తాము అందంగా కనిపించేందుకు ఫేషియల్, హెయిర్ స్టైల్స్ చేయించుకుంటారు. అయితే ఫేషియల్ అనేది మొహంలో గ్లో తీసుకువస్తుంది. దీనిలో కూడా వివిధ రకాల ఫేషియల్స్ ఉంటాయి. మీరు ఎలాంటి గ్లో కావాలి అనుకునేదాన్ని బట్టి.. మీరు ఫేషియల్స్ ఎంచుకోవచ్చు. అయితే మీరు ఎన్ని డబ్బులు పెట్టి ఫేషియల్ చేయించుకున్నా.. మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తే గ్లో కనిపించదు.
అవును కొన్ని పొరపాట్ల వల్ల ఫేషియల్ చేయించుకున్న గ్లో కనిపించదు అంటున్నారు స్కిన్ కేర్ నిపుణులు. మీకు రోటీన్ పనే అయినా కూడా.. ఫేషియల్ తర్వాత కొన్ని పనులు చేయవద్దు అంటున్నారు. ఫేషియల్ తర్వాత చర్మం చాలా సున్నితంగా మారుతుంది. కాబట్టి ఈ సమయంలో చర్మ సంరక్షణ రొటీన్లు లేదా ఉత్పత్తులు ఉపయోగిస్తే.. స్కిన్‌పై వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మీరు ఎక్కువ ఖర్చు పెట్టి ఫేషియల్స్ చేయించుకుంటున్నప్పుడు కచ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అప్పుడే మీరు మంచి గ్లోని పొందుతారు.
ముఖాన్ని టచ్ చేయకండి..
మీకు ముఖంపై పింపుల్స్ లేదా ఏమైనా స్పాట్స్ ఉంటే.. ఫేషియల్ తర్వాత మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మొటిమల నుంచి ఫస్ వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మీరు పింపుల్స్‌ను తాకకూడదు లేదా వాటిని పాప్ చేయకూడదు. మీరు మొటిమలు పాప్ చేసిన ప్రతిసారి బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. మొహం సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి స్కిన్‌పై ర్యాష్ పెరిగే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కలర్‌ను దెబ్బతీస్తుంది. కాబట్టి వాటిని అలా వదిలేస్తేనే మంచిది.
జిమ్‌కి బ్రేక్ తీసుకోండి..
ఫేషియల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత జిమ్‌కి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే ఎక్కువ చెమట వల్ల మొహంపై పింపుల్స్ రావొచ్చు. అధిక చెమటకు స్కిన్ ప్రతికూలంగా స్పందిస్తుంది. కాబట్టి మీరు ఫేషియల్ చేయించుకునే రోజు జిమ్‌కి వెళ్లడం లేదా తీవ్రమైన వ్యాయామాలు వంటివి చేయడం మానుకోండి. అదేవిధంగా జర్నీలు చేయడం కూడా తగ్గిస్తే మంచిది. ఒకవేళ మీరు జర్నీ చేసినా ఫేస్‌ని కవర్ చేసుకోవడం మంచిది.
మేకప్
ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎక్కువ మేకప్ వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఫేషియల్ తర్వాత మీ స్కిన్‌పై ఉన్న పోర్స్ సాధారణంగా కంటే ఎక్కువగా తెరుచుకుంటాయి. దీనివల్ల జెర్మ్సె, బ్రేక్ అవుట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటాయి. అందుకే కొన్ని రోజులు పాటు భారీ మేకప్‌లు వేసుకోకుండా ఉంటే మంచిది. అలాగే మీ మేకప్ టూల్స్‌ను మీ ముఖంపై ఉపయోగించే ముందు కూడా శుభ్రం చేసుకోండి.
స్కిన్ ఎక్స్పోజర్
ఫేషియల్ ట్రీట్మెంట్స్ తర్వాత మీ చర్మం సూర్యరశ్మి వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. క్లియర్ అయిన చర్మంపై సూర్యరశ్మి పడితే స్కిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఫైన్ లైన్స్, గీతలు వంటివి పెరుగుతాయి. మెలనోమా ఉత్పత్తి పెరిగి.. టాన్ అవుతుంది. అందుకే ఫేషియల్ చేయించుకున్న తర్వాత సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. ఎస్పీఎఫ్ 30 ఉన్న సన్‌స్క్రీన్ కచ్చితంగా ఉపయోగిస్తే మంచిది.
వాక్సింగ్ చేయకండి..
ఫేషియల్, హెయిర్ రిమూవల్ చేయించుకోవాలనుకుంటే ఫేషియల్ తర్వాత చేయించకండి. దీనివల్ల చర్మంపై గాట్లు పడే అవకాశముంది. ఫేషియల్‌లో ఎక్కువ డెడ్ స్కిన్‌సెల్స్‌ను తొలగించడానికి, తాజా చర్మ కణాలను బహిర్గతం చేయడానికి బాగా ఎక్స్ఫోలియేట్ చేస్తారు. దీనివల్ల స్కిన్ చాలా సెన్సిటివ్‌గా మారిపోతుంది. ఈ సమయంలో హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్కు దూరంగా ఉండడమే మంచిది.
Also Read : నిజమైన ప్రేమికులంటే వాళ్లే.. అమరం, అఖిలం వారి ప్రేమ