Pulwama Terror Attack Anniversary : ప్రపంచంలో అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ మరేది లేదు అంటారు. అలాంటి అమ్మ ప్రేమకు సమానమైన ప్రేమ ఉంటుందా? ఉండదు అనుకుంటారేమో.. అస్సలు అనుకోకండి. ఎందుకంటే అమ్మ ప్రేమను మించిన, గొప్ప ప్రేమ దేశ సైనికులదే. తల్లి ప్రేమలో తమ పిల్లలు బాగుండాలి.. ప్రయోజకులు కావాలని ఎలాంటి స్వార్థముంటుందో.. సైనికుల ప్రేమలో కూడా అలాంటి స్వార్థమే ఉంటుంది. తమ దేశం బాగుండాలి.. తమ దేశ ప్రజల కోసం ప్రాణాలైనా అడ్డు వేయగలిగేంత గొప్ప మనసు వారిది. అలాంటి ఓ గొప్ప ప్రేమ వీరిదే. 


పుల్వామా ఉగ్రదాడిలో ధైర్యంగా ప్రాణాలు విడిచిన CRPF సభ్యులకు గుర్తుగా 2019 నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 14న బ్లాక్​ డే నిర్వహిస్తున్నారు. భారత భద్రతా బలగాలపై వాలెంటైన్స్ డే రోజున అత్యంత ఘోరమైన దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది సభ్యులు ప్రాణాలు విడిచారు. జైషే మహ్మద్​కు చెందిన ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాన్వాయ్​పైకి రావడంతో ఈ ఘటన జరిగింది.


ఘటన వివరాలివే.. 


జమ్మూ కశ్మీర్​లో నలభై మంది సీఆర్​పీఎఫ్ సభ్యులు రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వారినే లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. దాడి జరిగిన కొద్దిసేపటికే జేఈఎం ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించారు. ఆత్మాహుతి బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ అని తెలిపారు. అతను దక్షిణ కశ్మీర్​లోని పుల్వామా జిల్లాలోని గుండిబాగ్ కాకాపోరాలో నివసించే ఉగ్రవాదని తేలింది. 


భద్రతా బలగాలకు స్వేచ్ఛ వచ్చేసింది..


భారత్​లో దాడులు చేయడానికి జెఎమ్ నాయడకుడు మసూద్ అజార్​కు పూర్తి స్వేచ్ఛను మంజూరు చేసినట్లు ఫిబ్రవరి 15, 2019 పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ తెలిపింది. అయితే పుల్వామా దాడిలో తాము పాల్గొన్నట్లు భారత్ చేసిన ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. ఈ విషయంపై భారత్​ కూడా ఘాటుగా స్పందించింది. బాధ్యులైన వారు భారీ మూల్యం చెల్లించక తప్పదని.. ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలకు స్వేచ్చనిస్తామని వెల్లండించారు. 


పాకిస్తానీ వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 200 శాతానికి పెంచారు. జేఎమ్​తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో కనీసం ఏడుగురిని పుల్వామా నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడితో భారత్ - పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి. దీంతో కాస్త వెనుక తగ్గిన పాకిస్తాన్.. ఈ ఘోరమైన దాడికి పాల్పడిన వారిని గుర్తించడానికి భారత్​తో కలిసి పని చేస్తామని హామి ఇచ్చింది. 


రివేంజ్​ డా..


ఫిబ్రవరి 26, 2019లో భారత వైమానిక దళం జెట్​లు బాలాకోట్​, పాకిస్తాన్​లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని జెఇఎమ్ శిబిరంపై బాంబు దాడి చేశాయి. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం తర్వాత.. దాడి విమానం నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్‌లోని జైష్-ఎ-మహ్మద్ శిబిరాలపై, నియంత్రణ రేఖ వెంబడి 1,000 కిలోల బాంబులు వేయడానికి ఆపరేషన్ నిర్వహించారు. పాకిస్తాన్‌లోని బాలాకోట్ సెక్టార్‌లోని జెఎమ్ క్యాంపు ఆపరేషన్ ఫలితంగా పూర్తిగా ధ్వంసం చేశారు.


Also Read : కండోమ్స్​కి కూడా ఒక డే ఉంది.. వాలెంటైన్స్ డే ముందు రోజే దానిని ఎందుకు జరుపుతారో తెలుసా?