Henna Benefits for Hair : హెన్నా జుట్టుకు ఎన్నో మంచి ప్రయోజనాలు అందిస్తుంది. కెమికల్స్ లేకుండా హెయిర్ కలర్ వేసుకోవడానికి హెన్నా మంటి ఆప్షన్. సింథటిక్ హెయిర్ డైలకు బదులుగా దీనిని చాలామంది ఉపయోగిస్తారు. అలాగే జుట్టుకు హెన్నా మంచి పోషణను అందిస్తుంది. జుట్టు పొడిబారడాన్ని తగ్గించి.. సాఫ్ట్‌గా, సిల్కీగా చేస్తుంది. హెయిర్ ఫాలికల్స్‌ను స్ట్రాంగ్‌గా చేసి.. జుట్టు పెరుగుదులను ప్రోత్సాహించడంలో కూడా హెల్ప్ చేస్తుంది.
స్కాల్ప్ సమస్యలు ఉన్నవారు కూడా హెన్నాను రెగ్యూలర్‌గా ఉపయోగించవచ్చు. దీనిలోని యాంటీ ఫంగల్, యాంటీబాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ సమస్యలను దూరం చేస్తాయి. చుండ్రు, దురద లక్షణాలు తగ్గుతాయి. అయితే హెన్నాను జుట్టుకు అప్లై చేసేముందు, చేసిన తర్వాత కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణలు. దీనివల్ల హెన్నా ప్రయోజనాలను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొందవచ్చని చెప్తున్నారు.
హెన్నా అప్లై చేసేముందు..
మొదటిసారి హెన్నాను జుట్టుకు అప్లై చేయాలనుకుంటే.. 48 గంటల ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల మీకు హెన్నాతో అలెర్జీ ఉంటే ముందే తెలుస్తుంది. మంచి క్వాలిటీ ఉండే హెన్నాను మాత్రమే ఎంచుకోవాలి. బాడీ ఆర్ట్ గ్రేడ్ హెన్నా పౌడర్‌ను వినియోగిస్తే మంచిది. వాష్ చేసిన జుట్టుపై మాత్రమే హెన్నాను అప్లై చేయాలి. నూనె అప్లై చేస్తే హెన్నా పెట్టుకోకపోవడమే మంచిది.
హెన్నా అప్లై చేస్తున్నప్పుడు..
హెన్నాను జుట్టుకు అప్లై చేస్తున్నప్పుడు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. హెన్నా పౌడర్‌ను నిమ్మరసం, టీ లేదా కాఫీ డికాక్షన్‌తో కలిపి పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. దానిలో కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె లేదా పెరుగు కూడా వేసుకుని కలుపుకోవచ్చు. వీటిని వేసుకోవడం వల్ల జుట్టుకు ఇంకా పోషణ అందుతుంది. మాయిశ్చరైజ్ అవుతుంది. చేతులకు గ్లౌవ్స్ వేసుకుని జుట్టుకు హెన్నా అప్లై చేసుకోవాలి. లేదా టింట్ బ్రష్ ఉపయోగించి హెన్నాను అప్లై చేసుకోవచ్చు.
హెన్నాను ఎప్పుడూ అప్లై చేసినా కుదుళ్ల నుంచి ముందుగా అప్లై చేయాలి. స్కాల్ప్ నుంచి అప్లై చేసుకుంటూ.. జుట్టుకు అప్లై చేయాలి. జుట్టును రెండు పార్టులుగా చేసి అప్లై చేస్తే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన హెన్నాను ఒకటి లేదా 2 గంటలు ఉంచుకోవాలి. రంగు మరింత ఎర్రగా కావాలనుకుంటే 2 నుంచి 4 గంటలు కూడా ఉంచుకోవచ్చు. జుట్టుకు పోషణ కావాలనుకుంటే 45 నిమిషాల్లో కడిగేసుకున్నా మంచిదే.
అప్లై చేసిన తర్వాత..
హెన్నా పూర్తిగా ఆరిన తర్వాత జుట్టునుంచి హెన్నా పోయేవరకు బాగా కడగాలి. గోరువెచ్చని నీటితో కడిగితే ఈజీగా వదిలిపోతుంది. అలాగే తలపై పడిన నీరు క్లియర్‌గా వచ్చేవరకు నీటితో జుట్టును హెన్నా పోయేవరకు వాష్ చేసుకోవాలి. అనంతరం మాయిశ్చరైజింగ్నిచ్చే షాంపూ, కండీషనర్‌ను అప్లై చేసుకోవాలి. ఇలా హెన్నాను నాలుగు నుంచి 6 వారాలకోసారి జుట్టుకు అప్లై చేసుకోవచ్చు.
కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్
హెన్నా పెట్టుకున్నాక మంచి రిజల్ట్స్ కోసం కాస్త ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. హెన్నాను అప్లై చేయకముందు మీకు దానివల్ల అలెర్జీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
Also Read : ఫ్రిడ్జ్ పాడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పండ్లు, కూరగాయలను తాజాగా ఉంచేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే