గుండెని పదిలంగా చూసుకోవడం చాలా ముఖ్యం. పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ నేటి రోజుల్లో అది మారిపోయింది. జీవనశైలి, ఆహారంలో మార్పులు కారణంగా గుండె ప్రమాదంలో పడిపోతుంది. గుండె జబ్బుల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ గణనీయంగా పెరుగుతుంది. అందుకే ఆరోగ్యంపై అధిక శ్రద్ధ అవసరం. గుండె జబ్బులు రావడానికి ఒక్కొకరికో ఒక్కో కారణం ఉంటుంది. ఊబకాయం దగ్గర నుంచి అధిక రక్తపోటు వరకు అన్నీ గుండెని ప్రమాదంలో పడేస్తాయి.


అందులోనూ మహిళల గుండె ఆరోగ్యం చాలా అవసరం. ఇంట్లో వాళ్ళు లేనిదే ఏ పని జరగదు. ఇంటి, బయట పనుల్లో పడి వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. తద్వారా రోగాల బారిన పడిపోతారు. మహిళలు పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వారిలో గుండె జబ్బులకి ప్రధాన కారణం అవుతుంది. అలాగే పాలిసిస్టిక్ అండాశయ వ్యాధి వంటి లక్షణాలు, మధుమేహం, ఎండో మెట్రియాసిస్ వంటి వాటి వల్ల గుండె సంబంధ సమస్యలు వస్తాయి.


మహిళల్లో గుండె జబ్బులకి మరికొన్ని కారణాలు


☀ అధిక బరువు


☀ ధూమపానం


☀ అధిక రక్తపోటు


☀ మధుమేహం


☀ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం


☀ సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు అధికంగా తీసుకోవడం


☀ BMI ఎక్కువగా ఉండటం


☀ తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వినియోగం తక్కువ


గుండెని పదిలంగా ఉంచుకోవడానికి మార్గాలు


గుండె పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఎప్పటికప్పుడు వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి


☀ తప్పనిసరిగా బరువు తగ్గించుకునేందుకు వ్యాయామం చెయ్యాలి


☀ మద్యపానం, ధూమపానం అలవాట్లు వదులుకోవాలి


☀ కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు డైట్లో బాగం చేసుకోవాలి


☀ అధిక మొత్తంలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారం తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్, ఆకుకూరలు, యాపిల్ తీసుకోవాలి.


☀ ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి


☀ మధుమేహం, హైపర్ టెన్షన్ తో బాధపడుతుంటే వాటిని నియంత్రణలో ఉంచుకోవడం తప్పని సరి


☀ క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి, శారీరక శ్రమ అలవాటు చేసుకున్నా మంచిదే


☀ శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, గుండెల్లో దడ వంటి లక్షణాలు కనిపిస్తే అసలు విస్మరించొద్దు.


☀ గుండెని రక్షించుకునేందుకు పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె రక్త నాళాలు గడ్డకుండా చేస్తాయి. అందుకే అవి పుష్కలంగా ఉండే చేపలు, వాల్ నాట్స్ తీసుకుంటే మంచిది.


☀ మెనోపాజ్ దాటిన మహిళలు తప్పనిసరిగా ఏడాదికి ఒకసారైన గుండెకి సంబంధించి పరీక్షలు చేయించుకోవాలి.


☀ అన్నింటికీ మించి పోషకాలతో నిండిన సమతుల ఆహారం తీసుకోవాలి. పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా లభించే విధంగా డైట్ పాటించాలి.  


☀ ఉప్పు వీలైనంత వరకు తగ్గించుకునే తినాలి. మధుమేహం ఉన్న మహిళల్లో ఎల్దీయల్ కొలెస్ట్రాల్ 70 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉండాలి. లేదంటే దాని ప్రభావం గుండె మీదే అధికంగా పడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: వెన్ను నొప్పి వేధిస్తోందా? ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు


Also Read: అల్లం, వెల్లులి మిశ్రమం అంత పవర్‌ఫుల్లా? ఈ రోగాలన్నీ హాంఫట్!