Tips for a Thyroid-Friendly Diet : థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవాలనుకుంటే రెగ్యులర్​గా మెడిసన్ తీసుకోవాలి. అలాగే కొన్ని ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. లేదంటే అవి ఈ సమస్యను రెట్టింపు చేసి ఇబ్బందులకు గురిచేస్తాయి. హెల్తీ అయినా ఈ ఫుడ్స్​ని రోజూ తీసుకుంటే థైరాయిడ్ సమస్యలు పెరుగుతాయట. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి? ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే థైరాయిడ్ కంట్రోల్​లో ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. 

థైరాయిడ్ ఉన్నవారు తినకూడని ఫుడ్స్

సోయా ఫుడ్స్ : థైరాయిడ్ ఉన్నవారు సోయా ఉత్పత్తులు తీసుకోకూడదని చెప్తున్నారు. ఇవి థైరాయిడ్ మందులకు ఆటంకం కలిగించడమే కాకుండా.. థైరాయిడ్ పనితీరును తగ్గిస్తుంది. 

బ్రోకలీ : బ్రోకలీ, కాలీఫ్లవర్, కాలే, పాలకూర వంటివి పోషకాలతో నిండి ఉన్నప్పటికీ.. థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. ఇవి శరీరంలోని ప్రతికూల ప్రభావాలను ఇస్తుందట. 

గ్లూటెన్ : థైరాయిడ్​తో ఇబ్బందిపడేవారికి గ్లూటెన్ ఇబ్బందులు కలిగించవచ్చు. సెన్సిటివిటీని పెంచుతుంది. థైరాయిడ్ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. 

మిల్క్ ప్రొడెక్ట్స్ : థైరాయిడ్ ఉన్న కొందరిలో లాక్టోస్ ఎఫెక్ట్ ఉంటుంది. పాలలోని ప్రోటీన్లకు థైరాయిడ్ మరింత సెన్సిటివ్​గా మారుతుంది. ఇది వాపును ప్రేరేపిస్తుంది. 

షుగర్ : అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం వల్ల వాపు ఎక్కువై.. థైరాయిడ్ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. షుగర్ ఫ్రీ ఫుడ్ కూడా థైరాయిడ్​ని ట్రిగర్ చేస్తుంది. 

చెడు కొవ్వులు : సంతృప్తమైన, ట్రాన్స్ ఫ్యాట్స్​లు శరీరంలో మంటను పెంచుతాయి. థైరాయిడ్ లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. ప్రాసెస్ చేసిన మీట్​, వేయించిన ఆహారాలు, డీప్ రోస్ట్ చేసిన ఫుడ్స్ ఇబ్బందులకు గురిచేస్తాయి. 

థైరాయిడ్ మందులకు ఆంటంకం కలిగించే ఫుడ్స్ ఇవే

థైరాయిడ్ మందులు శరీరానికి అందకుంండా.. వాటి శోషణను కొన్ని ఫుడ్స్ అడ్డుకుంటాయి. కాల్షియం థైరాయిడ్ మందుల శోషణకు ఆటంకం కలిగిస్తుందట. మిల్క్ ప్రొడెక్ట్స్, మొక్కల ఆధారిత పాలు, కాల్షియం సప్లిమెంట్స్​ కూడా థైరాయిడ్ మందుల శోషణను అడ్డుకుంటాయి. ఐరన్​ ఫుడ్స్ కూడా ఇదే ఫలితాలు ఇస్తాయి. రెడ్ మీట్, పౌల్ట్రీ, చేప, ఐరన్ సప్లిమెంట్లు థైరాయిడ్​కు ఆటంకం కలిగిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కూడా థైరాయిడ్ మందుల శోషణను అడ్డుకుంటాయి. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, మిల్లెట్స్​కూడా తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. 

ఏ ఫుడ్స్ తినొచ్చంటే.. 

సమతుల్యమైన ఆహారం థైరాయిడ్​ని కంట్రోల్ చేస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, ప్రాసెస్ చేయని ఫుడ్స్​ని బ్యాలెన్స్డ్​గా డైట్​లోకి తీసుకోవాలి. థైరాయిడ్ పనితీరుకు మద్ధతునిచ్చే ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్, సెలీనియం, జింక్ అధికంగా ఉండే ఫుడ్స్ డైట్​లో చేర్చుకోవాలి. చేపలు, బ్రెజిల్ నట్స్ మంచివి. థైరాయిడ్ సరిగ్గా పనిచేయడానికి రోజంతా పుష్కలంగా నీటిని తీసుకోవాలి. హైడ్రేటెడ్​గా ఉంటే మంచిది. 

ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఫుడ్స్​ని కంట్రోల్ చేయండి. ఆహారంలో చక్కెరలు, అన్​ హెల్తీ ఫ్యాట్స్ తగ్గించుకోవాలి. లేకుంటే ఇవి థైరాయిడ్ సమస్యను మరింత పెంచుతాయి. ఆహారాన్ని పచ్చిగా కాకుండా బాగా ఉడికించుకుని తింటే మంచిది. వీటితో పాటు మీరు డైటీషయన్​ను సంప్రదించి.. ప్రోపర్​ డైట్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.