కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు. మరొ ఇద్దరు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 24 దక్షిణ పరగణాల జిల్లాలో సోమవారం రాత్రి ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు.
వంట చేస్తుంటే గ్యాస్ లీకై పేలుడు సంభవించిందా, లేక ఎవరైనా కావాలనే సిలిండర్ పేల్చేందుకు ప్లాన్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. సిలిండర్ పేలుడుతో గోడలు పూర్తిగా ధ్వంసం కావడంతో, వస్తువులు బయట వచ్చి పడ్డాయి. సిలిండిర్ పేలిన ఇంటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజల పెద్ద సంఖ్యలో వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.