భారతదేశంలో దాదాపు సగానికి పైగా జనాభా టీ తోనే గుడ్ మార్నింగ్ చెబుతారు. వీరిలో చాలామందికి ఉదయం టీ తాగడంతో పాటూ, సాయంత్రం పూట టీ తాగే అలవాటు కూడా ఉంటుంది. రోజుకి రెండుసార్లు టీ తాగే వారి సంఖ్య చాలా ఎక్కువ. టీ తాగితేనే వారు పనులు చేయగలుగుతామని చెబుతారు. అంటే టీ కి అంతగా వారు బానిసలుగా మారారు. ఒక్క పూట టీ తాగకపోయినా, ఏదో అయిపోతున్నట్టు ఫీల్ అవుతారు. నిజానికి ఏమీ జరగదు. అలవాటును కొంచెం కొంచెంగా తగ్గించుకోవచ్చు, కానీ మానుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. సాయంత్రం పూట టీ తాగే అలవాటును కొంతమంది మానుకోవాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
ఎందుకు మానేయాలి?
సాయంత్రం, ఉదయం ఇలా రెండుసార్లు టీ తాగే అలవాటును మానుకోవాల్సిన అవసరం ఉంది. రోజుకు ఒకసారి టీ తాగితే చాలు. సాయంత్రం పూట తాగాల్సిన అవసరం లేదు, అయినా సరే సాయంత్రం నాలుగు అయిందంటే టీ కోసం తాపత్రయపడుతుంటారు ఎంతోమంది.ఇలా సాయంత్రం టీ తాగడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, తమకు తెలియకుండానే ఇబ్బంది పడుతున్నట్టు చెబుతున్నారు వైద్యులు. ఎక్కువగా పాలు, చక్కెర జోడించి తాగే టీ వల్లే సమస్యలు వస్తున్నాయి. టీ ఉదయం తాగితే ఆరోగ్యాన్ని అందిస్తుంది, కానీ సాయంత్రం తాగడం వల్ల సమస్యలను తెచ్చిపెడుతుంది. నిద్ర పట్టనివ్వదు. బరువు పెరగనివ్వదు. ఆకలి వేయదు. ఇలా ఎన్నో సమస్యలు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారంతా సాయంత్రం టీ కి గుడ్ బై చెప్పాల్సిందే.
ఇలాంటి సమస్యలు ఉంటే...
1. మానసిక ఆందోళన, యాంగ్జైటీ, ఒత్తిడితో బాధపడుతున్న వారు సాయంత్రం టీ తాగకూడదు.
2. పొడి చర్మం, పొడి జుట్టు వంటి సమస్యలతో బాధపడేవారు కూడా దీనిని వదిలేయాలి.
3. తక్కువ బరువు కలవారు, బరువు పెరగడానికి ప్రయత్నాలు చేస్తున్న వారు సాయంత్రం టీ ని తాగకూడదు.
4. ఆకలి సరిగా వేయని వారు తేనీటిని వదిలేయాలి.
5. హార్మోన్ సమస్యలతో బాధపడుతున్న వారు టీ కి గుడ్ బై చెప్పాల్సిందే.
6. మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వంటివి ఉన్నవారు సాయంత్రం పూట టీ తాగకూడదు.
7. నిద్రలేమితో బాధపడేవారు, ఇన్‌సోమ్నియా వంటి జబ్బులు కలవారు టీ సాయంత్రం పూట ముట్టుకోకూడదు.
8. ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారు టీ తాగకూడదు. 9. అజీర్ణం, అజీర్తి, జీవక్రియ సరిగా లేనివారు సాయంత్రం పూట టీ తాగకూడదు.
Also read: కరోనా కొత్త వేరియంట్ ఆర్కుట్‌రస్, కేసులు పెరుగుదలకు ఈ వేరియంటే కారణమా?
Also read: ఒక బిడ్డను కన్నాక లావుగా అయ్యాను, నా భర్త పంది, ఏనుగు అని పిలుస్తున్నాడు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.