మనలో ఎక్కువ మంది రోజుని కాఫీ తాగి స్టార్ట్ చేస్తారు. నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగితే రిలాక్స్ గా అనిపిస్తుంది. అది శక్తి స్థాయిలని పెంచుతుందని అంటారు. కానీ మీ కాఫీ రొటీన్ ఒక్కోసారి ఆరోగ్యం మొత్తం మీద చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని విషయం గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఖాళీ పొట్టతో కాఫీ తీసుకోవడం వల్ల శరీరాన్ని అధిక ఒత్తిడి మోడ్ లోకి నెట్టినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. దీన్ని ఎదుర్కోవాలంటే మీరు కాఫీ తాగే ముందుగా ఈ చిట్కాలు పాటించండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాఫీ ప్రయోజనాలు పొందవచ్చు.
హైడ్రేషన్
కప్పు కాఫీ తాగే ముందు పుష్కలంగా నీరు తాగాలి. ఫ్రిజ్ వాటర్ కాకుండా గది ఉష్ణోగ్రత కలిగిన నీటిని తాగితే మంచిది. అందులో కాస్త నిమ్మకాయ పిండుకుని తాగితే జీర్ణక్రియకి సహాయపడుతుంది. నీరు తాగకుండా కాఫీ నేరుగా తీసుకోవడం వల్ల ఆ వేడి పదార్థం అన్నవాహికని దెబ్బతీసే ప్రమాదం ఉంది.
పోషకాలు నిండిన ఆహారం
రక్తంలో చక్కెర స్థాయిలని సమతుల్యం చేయడానికి ఫైబర్, ప్రోటీన్ తో కూడిన ఆహారం తీసుకుంటే మంచిది. అల్పాహారంలో చియా ఫుడ్డింగ్ లేదంటే ఒక గిన్నె నిండుగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్యమైన ఆహారం తీసుకున్న తర్వాత కాఫీ తాగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. లేదంటే కాఫీ వల్ల షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులు నమోదు అయ్యే అవకాశం ఉంది. దీని వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతుంది.
వ్యాయామం
జిమ్ కి వెళ్ళే ముందు కొంతమందికి కాఫీ తాగడం అలవాటు. కానీ అది మంచి ఆలోచన కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాఫీ తాగడానికి ముందుగా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలని సూచిస్తున్నారు. నిద్రలేచిన గంట వ్యవధిలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తాయి.
సహనం పెరుగుతుంది
నిద్రలేచిన తర్వాత 90 నిమిషాల పాటు కెఫీన్ ని తీసుకోవడం ఆలస్యం చేస్తే రోజంతా యాక్టివ్ గా ఉంటారు. కానీ ఉదయం నిద్రలేవగానే కాఫీ తాగకుండా ఉండటం అంటే చాలా కష్టమైన పని. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా నిమ్మరసం, తేనె కలిపిన నీటిని తాగితే బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరిగేందుకు ఆస్కారం ఉంటుంది.
కాఫీ తాగడం వల్ల అందులోని కెఫీన్, నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలకు విశ్రాంతిని ఇస్తాయి. పాలతో కలిపి కాఫీ తీసుకుంటే ఆరోగ్యకరమని పరిశోధకులు చెబుతున్నారు. పాలలోని ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి సహాయం చేస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: డయాబెటిస్ బాధితులు వంకాయలు తినొచ్చా? ప్రయోజనాలు ఏమిటీ?