శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. ఇది లోపిస్తే ప్రమాదమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదయాన్నే తేలికపాటి సూర్యకాంతి శరీరానికి తగలడం వల్ల విటమిన్ డి అందుతుంది. రక్తంలో కాల్షియం సమతుల్యతను కాపాడుకోవడానికి, ఎముకలను నిర్మించేందుకు విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యకరమైన కణజాలాలకు మద్దతుగా కాల్షియం, భాస్వరం అందించాలంటే శరీరానికి విటమిన్ డి అవసరం. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఒక బిలియన్ మంది ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అంటే జనాభాలో 50 శాతం మందికి విటమిన్ డి లోపం ఉంది. ఈ లోపం వల్ల నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ, ఎముకలు, కీళ్ల రుగ్మతలు ఎదురవుతాయి. ఇవే కాదు హైపోకాల్సేమియా, బలహీనత, తిమ్మిరి, అలసట, నిరాశ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇవే కాదు ఈ భయంకరమైన లక్షణాలు కనిపిస్తే మీరు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్టే.


డిప్రెషన్, ఆందోళన


ఒత్తిడి, ఆహారం, జీవనశైలిలో మార్పుల వంటి అనేక ఇతర సమస్యల కారణంగా ఆందోళన, నిరాశ కలుగుతాయి. విటమిన్ డి లోపం వల్ల కనిపించే ప్రధానమైన లక్షణాల్లో ఇదీ ఒకటి. శరీరానికి సూర్యరశ్మి తగిలినప్పుడు మెలటోనిన్ నుంచి సెరోటోనిన్ ఉత్పత్తి చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సెరోటోనిన్ తగ్గినప్పుడు చిరాకు, నిరాశ, ఆందోళనగా అనిపిస్తుంది.


కండరాలు, ఎముకల నొప్పి


విటమిన్ డి లోపం అంటే శరీరంలో కాల్షియం తగినంతగా శోషించలేదని అర్థం. దీని వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఫలితంగా దీర్ఘకాలిక కండరాల నొప్పి, కీళ్లలో నొప్పి, బోలు ఎముకల వ్యాధి ఏర్పడుతుంది.


జుట్టు రాలడం


జుట్టు రాలడం సాధారణ సమస్య అనుకుంటారు. కానీ విటమిన్ డి లోపం వల్ల కూడా జుట్టు రాలే ప్రమాదం ఉంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు, చర్మం ప్రధాన నిర్మాణ భాగాలు బలహీనంగా మారి వాటి శక్తిని కోల్పోయినప్పుడు ఇలా జరుగుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం 65 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు.


గాయాలు నయం కాకపోవడం


ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్ తో పోరాడటంలో విటమిన్ డి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ లేకపోవడం వల్ల గాయాలు త్వరగా నయం కావు. యాంటీమైక్రోబయల్ పెప్టైడ్ రోగనిరోధక వ్యవస్థ వల్ల గాయం ఇన్ఫెక్షన్లతో పోరాదటానికి సహాయపడుతుంది.


సంతానలేమి


కొన్ని అధ్యయనాల ప్రకారం విటమిన్ డి లోపం స్త్రీలు, పురుషులలో వంధ్యత్వానికి దారి తీస్తుంది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ తో బాధపడే వాళ్ళు, విటమిన్ డి లోపంతో బాధపడే స్త్రీలలో గర్భాశయ ఫైబ్రాయిడ్లు అండాశయాలు తగ్గడానికి కారణమవుతాయి. పురుషులలో అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: ఆయుర్వేదంలో ఔషధాలుగా పరిగణించే పండ్లు ఇవే- వీటిని తింటే బోలెడు ప్రయోజనాలు