త్తిడి, ఎక్కువ స్క్రీన్ ఎక్స్ పోజర్, నిద్ర లేకపోవడం వల్ల మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. మెదడు కణాలని బలహీనపరుస్తుంది. ఫలితంగా నిద్రలేమి, స్లీప్ అప్నియా వంటి సమస్యలు వస్తాయి. దీనికి పరిష్కారం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ మెరుగైన జీవనశైలికి మారడమే. సింపుల్ గా ఇంట్లో తయారు చేసుకునే ఈ పానీయాలు తీసుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. మెదడు నరాలకి ఇవి విశ్రాంతిని ఇస్తాయి.


కుంకుమపువ్వు పాలు/ టీ 


నిద్రకి ఉపక్రమించే ముందు కుంకుమ్మ పువ్వు టీ వంటి హెర్బల్ టీ తాగడం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయి. ఒత్తిడిని తగ్గించి నిద్రపట్టేలా చేస్తుంది. మూడ్ లిఫ్టర్ గా ఇది గొప్పగా పని చేస్తుంది. ఇందులోని శక్తివంతమైన ఔషధ గుణాలు శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. కుంకుమపువ్వు పాలలో కలపడం వల్ల అందులోని ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం నిద్రని మెరుగుపరుస్తుంది.


సోంపు గింజలు, బాదం పాలు


సోంపు గింజలు, బాదంపప్పులు సమానంగా తీసుకుని పొడి చేసుకుని పెట్టుకోవాలి. రోజు నిద్రపోయే ముందు 1 టేబుల్ స్పూన్ ఈ పొడిని గోరు వెచ్చని పాలలో కలుపుకుని తాగడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. జీవక్రియని పెంచుతుంది. సోంపు గింజలకు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే బాదంపప్పులు జోడించడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఎక్కువ సేపు స్క్రీన్ ఎక్స్ పోజర్ వల్ల కళ్ళు అలసిపోతాయి. ఇది తీసుకోవడం వల్ల దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది. కళ్ళకి ఎటువంటి హాని జరగకుండా కాపాడుతుంది.


చామంతి పూల టీ


నిద్రపోయే ముందు ఒక కప్పు చామంతి పూల టీ తాగడం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయి. ఆందోళన తగ్గి నిద్రని ప్రేరేపిస్తుంది. రోజు ఈ టీ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆరోగ్యకరమైన జీవక్రియని అందిస్తుండు. ఈ టీ తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్.


లావెండర్ టీ


ఈ హెర్బల్ టీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. చలికాలంలో శరీరానికి వెచ్చదనం ఇవ్వడంతో పాటు మనసుకి ప్రశాంతత ఇస్తుంది. హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో కొన్ని లావెండర్ పూలు లేదా టీ బ్యాగ్ వేసి బాగా మరిగించుకోవాలి. ఈ టీ తాగడం వల్ల నిద్ర నాణ్యతా కూడా మెరుగుపడుతుంది. వేగంగా నిద్రని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల ఏర్పడే నష్టాన్ని తగ్గిస్తుంది. లావెండర్ లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెరుగైన కణాల పునరుత్పత్తికి సహాయపడతాయి. జీవక్రియ ఆరోగ్యాన్ని పెంచుతాయి.


అశ్వగంధ టీ


పురాతన కాలం నుంచి వస్తున్న వాడుతున్న అశ్వగంధలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల నరాలకి విశ్రాంతి ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. నిద్ర పోవడానికి ముందు అర టీ స్పూన్ అశ్వగంధ పొడితో చేసిన టీ తాగితే హాయిగా పడుకోవచ్చు. తేనె కలుపుకుని తాగాలి. ఈ టీలో పాలు కూడా కలుపుకుని తాగొచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: ప్రోటీన్స్ vs కార్బ్స్ - బరువు తగ్గేందుకు వీటిలో ఏది ఉత్తమం?