తెలంగాణ ఎంసెట్ 2023 నోటిఫికేషన్ జనవరిలో విడుదలకానుంది. ఒకపక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలను వెల్లడించడం, మరోవైపు ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూలును ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ ఎంసెట్‌ నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది. 2023 జనవరిలో పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని నిర్ణయించింది. దీనికోసం మండలి అధికారులు త్వరలో సమావేశం కానున్నారు. ఎంసెట్‌ పరీక్షను మే రెండోవారం లేదా మూడోవారంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్‌ పరీక్షల తర్వాత ఎంసెట్‌ సన్నద్ధతకు కనీసం 45 రోజుల కాలపరిమితి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటర్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరుగుతాయి. ఈ లెక్కన మేలో ఎంసెట్‌కు అనువైన తేదీలను ఖరారు చేసే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.


జూన్‌లో ఫలితాలు..?
జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు జరుగుతాయి. రెండో విడత ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు ఉంటుంది. జేఈఈ పూర్తయిన తర్వాత కూడా ఎంసెట్‌కు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులకు సమయం దొరుకుతుంది. కోవిడ్‌ కారణంగా రెండేళ్లుగా ఎంసెట్‌ ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సకాలంలో విద్యా సంవత్సరం కొనసాగింది. దీంతో జేఈఈ మెయిన్స్‌ కూడా గతం కన్నా ముందే పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ను త్వరగా నిర్వహించి జూన్‌లో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆగస్టు చివరి నాటికి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగించాలని యోచిస్తున్నారు. ఈసారి కూడా ఇంటర్‌ మార్కుల వెయిటేజీ లేనట్టేనని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు.  


తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, తేదీల వివరాలివే!
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ తాజాగా విడుదల చేసింది. 2023 మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 15న ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, మార్చి 16న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని బోర్డ్ వెల్లడించింది. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ మార్చి 15న మొదలు కాగా, ఏప్రిల్ 3న ముగియనున్నాయి. సెకండియర్ ఎగ్జామ్స్  మార్చి 16న మొదలుకాగా, ఏప్రిల్ 4న ముగుస్తాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది.
ఇంటర్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మేలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ..
ఇంటర్‌ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత నెల రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఫెయిలైన వారికి, మార్కులు తక్కువగా వచ్చినవారికి మేలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫలితాలు ప్రకటించిన రోజే ఆయా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు రాసే వారు కూడా ఎంసెట్‌ పరీక్షలు రాసేందుకు అర్హులే. 


Also Read:


తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, తేదీల వివరాలివే!
TS Intermediate Exams Time Table: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ తాజాగా విడుదల చేసింది. 2023 మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 15న ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, మార్చి 16న సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని బోర్డ్ వెల్లడించింది. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ మార్చి 15న మొదలు కాగా, ఏప్రిల్ 3న ముగియనున్నాయి. సెకండియర్ ఎగ్జామ్స్  మార్చి 16న మొదలుకాగా, ఏప్రిల్ 4న ముగుస్తాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


KNRUHS: బీడీఎస్ 'మేనేజ్‌మెంట్' సీట్ల భర్తీకి మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల, వెబ్ ఆప్షన్లకు అవకాశం!
తెలంగాణలోని ప్రైవేట్‌ డెంటల్‌ కాలేజీల్లో యాజమాన్య కోటా కింద బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన మాప్ అప్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం డిసెంబరు 19న విడుదల చేసింది. డిసెంబరు 19, 20 తేదీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. రెండో విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాల వారిగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
నోటిఫికేషన్, ప్రవేశాలు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి.


నీట్ యూజీ-2023, సీయూఈటీ పరీక్షల తేదీలు ఖరారు, ఎప్పుడంటే?
దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ-2023 పరీక్ష తేది ఖరారైంది. వచ్చే ఏడాది మే 7న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇక కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2023 పరీక్షలను మే 21-31 మధ్య నిర్వహిస్తామని ఎన్టీఏ తెలిపింది. కాగా జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూలు ఇప్పటికే ప్రకటించగా.. తొలి విడత పరీక్షలు జనవరి 24, 25, 27, 29, 30, 31 తేదీల్లో రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..