ఓ వైపు వర్షం పడుతున్నపుడు వేడి వేడి టీ తాగితే భలే ఉంటుంది కదా. అదే మామూలు టీ కాకుండా హెర్బల్ టీ తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం మనసుకి ఉల్లాసంగా కూడా ఉంటుంది. సాధారణంగా వాతావరణం మారితే మనలో చాలా మంది అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడతారు. అటువంటి టైమ్ లో ఈ హెర్బల్ టీ చాలా మంచిది. అల్లం, పసుపు, మందారం వంటి వాటిని వేసుకోవడం వల్ల మీ టీకి మంచి రుచితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.
పసుపు
పసుపు మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అందుకే పెద్దవాళ్ళు చాలా మంది జలుబు, దగ్గు అంటే పసుపు వేసిన పాలు తాగమని చెప్తారు. పసుపు వేసుకుని తయారు చేసిన టీ తాగడం వల్ల మన శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ ని మన దారి చేరనివ్వదు. బరువు తగ్గాలనుకున్న వారికి ఈ టీ చాలా ఉపయోగపడ్తుంది.
తులసి
ఎన్నో రకాల పోషకాలు ఉన్న వాటిలో తులసి ప్రత్యకమైనది. షుగర్ పేషంట్స్ తులసి ఆకులు కొన్ని నవిలితే మంచిదని అంటారు. ఇందులో ఉండే విటమిన్ ఎ, డి, ఐరన్, ఫైబర్ గుణాల వల్ల మనలో ఉండే చెడు బ్యాక్టీరియాని నాశనం చేసి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంటే కాదు నోటి దుర్వాసన పోగొట్టడానికి దంతాల పరిరక్షణకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
సప్తవర్ణ మొక్కలు
మాన్ సూన్ సీజన్ వచ్చిందంటే దోమలు స్వైరవిహారం చేస్తాయి. వాటి వల్ల వ్యాపించే రోగాలు, మలేరియాకు ఐ సప్తవర్ణ మొక్కల మూలికలతో చేసిన టీ చాలా మంచిది. దిన్నె వైట్ చీజ్ అని కూడా అంటారు. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంటే కాదు చర్మ సమస్యల నుంచి రక్షించడంతో పాటు గాస్ట్రిక్ సమస్య నుంచి మనల్ని బయటపడేస్తుంది.
అల్లం
వర్షం పడుతుందని రోడ్డు మీద దొరికే అడ్డమైన చెత్త తినేయడం తర్వాత కడుపు నొప్పితో బాధపడతాం. అటువంటి సమయంలో అల్లంతో చేసిన టీ అద్భుతంగా పని చేస్తుంది. ఇది మన జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరచడానికి ఎంతో దోహదపడుతుంది. మార్నింగ్ సిక్ నెస్ లేకుండా చేస్తుంది.
మందార
వర్షాకాలంలో మందారం తో చేసిన టీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఆంథోసైనిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి రక్షణగా నిలుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది చాలా యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియాల్ ప్రభావాలను కలిగి ఉంటుంది.