ఖరీదైన కూరగాయలు అంటే బ్రకోలీ, ఎరుపు, పసుపు క్యాప్సికమ్... వంటివి అనుకుంటారు చాలామంది. కానీ అన్నింటికన్నా ఖరీదైన కూరగాయ ‘హాప్ షూట్స్’.  దీన్ని తినాలంటే అదృష్టం ఉండాలి ఎందుకంటే కిలో కొనాలంటే 85,000 రూపాయలు ఖర్చుపెట్టాలి. కాబట్టి కేవలం ధనవంతుల ఆహారంగా మారింది ఈ కూరగాయ.  మనదేశంలో దీన్ని సాగు చేయడం లేదు, కానీ ఒకసారి హిమాచల్ ప్రదేశ్లో నాటినట్లు వార్తలు వచ్చాయి. అలాగే బీహార్‌కు చెదిన అర్నేష్ సింగ్ అనే రైతు కూడా వీటిని పండించినట్టు తెలుస్తోంది. కానీ వాటిని పండించడానికి అధిక వ్యయం అవుతుండడంతో పండించడం ఆపేశారు. అందుకే మన దేశంలో ఈ కూరగాయ దొరకదు. 


హాప్ షూట్‌లు అంటే ఏమిటి?
శాస్త్రీయంగా వీటిని హ్యూములస్ లుపులస్ అని పిలుస్తారు. ఇవి జనపనార కుటుంబానికి చెందిన మొక్కలు.ఈ పంట చేతికి రావాలంటే మూడేళ్లు పడుతుంది. హాప్ షూట్‌లకు పూసే పువ్వును బీర్ తయారీలో వాడతారు. దీనిలో విటమిన్లు E, B6, Cలతో నిండి ఉంటుంది. అపారమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు అధికం. అందుకే ఈ కూరగాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 


క్షయవ్యాధికి ...
ఈ కూరగాయలో క్షయవ్యాధికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతిరోధకాలను సృష్టించే శక్తి ఉంది.TB అనేది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు హాప్ షూట్స్ సహాయపడతాయి.


నిద్రలేమికి ..
నిద్రలేమి, టెన్షన్, ఒత్తిడి, ఆందోళన, యాంగ్జయిటీ  వంటి అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో హాప్ షూట్స్ ఉపయోగపడతాయి. హాప్ షూట్స్ పువ్వులను ఎండబెట్టి ఆ పొడిని ఔషధాలలో ఉపయోగిస్తారు. 


చర్మ సమస్యలకు..
 హాప్ షూట్స్ పువ్వులు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడి, ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచుతాయి. వీటిని తినడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. చర్మంపై ఉన్న మచ్చలు పోతాయి. చర్మంపై దద్దుర్లు, దురదలను పొగొడుతుంది.


జీర్ణక్రియకు...
హాప్ షూట్లు తినడం వల్ల జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. తిన్న ఆహారం చక్కగా అరిగితేనే శరీరం శక్తిని, ఖనిజాలు, విటమిన్లను శోషించుకోగలదు. 


Also read: ప్రతిరోజూ చికెన్ తింటున్నారా? ఇలా తింటే ఈ ఇబ్బందులు రావడం ఖాయం











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.