కొరియన్స్ చర్మం మీద మచ్చలు, గీతలు అనేది లేకుండా ఎంతో మృదువుగా మెరిసిపోతూ కనిపిస్తారు. వారి చర్మ సౌందర్యం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. చూపు తిప్పుకోనివ్వని అందంతో ఉంటారు. వారి బ్యూటీ సీక్రెట్స్ గురించి తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తారు. కొరియన్స్ అంత అందంగా ఉండటం కోసం ఒక ప్రత్యేకమైన టీ తాగుతారు. అదే బోరి చా. దీన్నే బార్లీ టీ అని కూడా పిలుస్తారు. ఎన్నో శతాబ్ధాలుగా కొరియన్ సంస్కృతిలో ఈ టీ అంతర్భాగం అయిపోయింది. చర్మ పోషణ కోసం తప్పనిసరిగా తీసుకుంటారు. ఇది ప్రకాశవంతమైన ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది.


బార్లీ టీ ఎలా వచ్చిందంటే..


కొరియన్ సంస్కృతిలో బార్లీ టీకి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉండి. గొరియో రాజవంశం వాళ్ళు తీసుకొచ్చారని చెప్తుంటారు. దాహాన్ని తీర్చేందుకు, రీఫ్రెష్ మెంట్ ఇవ్వడానికి ఈ పానీయం వినియోగిస్తారు. వేడిగా లేదంటే చల్లగా దీన్ని తీసుకుంటారు. మొదట దాహాన్ని తీర్చేందుకు ఉపయోగించగా క్రమంగా ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారు.


బార్లీ టీ అనేది కాల్చిన బార్లీ గింజల నుంచి తయారు చేయబడిన కషాయం. దీన్ని తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి అనుసరిస్తారు. ఈ టీ విధానం తెలుసుకుంటే మీరు ఇంట్లో సింపుల్ గా తయారు చేసుకోవచ్చు.


కావలసినవి


కాల్చిన బార్లీ గింజలు- 1 కప్పు


నీరు- 4 లేదా 5 కప్పులు 


తయారీ విధానం


బార్లీ గింజల్ని పొడి చేసుకోవడం కోసం వాటిని గోధుమ రంగులోకి వచ్చే వరకు మీడియం మంట మీద వేడి చేసుకోవాలి. మంచి సువాసన వస్తుంది. తర్వాత దాన్ని మెత్తగా పొడి చేసుకోవచ్చు. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. అందులో వేయించిన బార్లీ గింజలు వేసుకోవచ్చు. 15-20 నిమిషాల వరకు బాగా మరిగించాలి. అంతే దీన్ని చల్లగా లేదంటే వేడిగా కూడా టీ తాగొచ్చు.


బార్లీ టీ ప్రయోజనాలు


☀ ఆరోగ్యకరమైన చర్మానికి హైడ్రేషన్ కీలకం. బార్లీ టీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. తేమని అందిస్తుంది. పొడి బారిపోకుండా చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.


☀ బార్లీ టీలో క్వెర్సెటిన్, కాటేచిన సహ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ముడతలు, గీతలు లేని చర్మం అందిస్తుంది.


☀ బార్లీ టీ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకి పంపుతుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. స్పష్టమైన మచ్చలు లేని చర్మం ఇస్తుంది.


☀ ఆరోగ్యకరమైన జీర్ణక్రియ మెరిసే చర్మంతో ముడిపడి ఉంటుంది. బార్లీ టీ జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది. మొటిమలు, విరోచనాలు వంటి జీర్ణ సమస్యలు చర్మ సమస్యలు కలిగిస్తాయి. వాటిని నిలువరిస్తుంది.


☀ ఒత్తిడి చర్మాన్ని నాశనం చేస్తుంది. బార్లీ టీ తీసుకోవడం వల్ల నరాలకు విశ్రాంతిని ఇస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది.


☀ చర్మాన్ని రీఫ్రెష్ చేయడానికి టోనర్ గా ఉపయోగపడుతుంది.


☀ కొన్ని కప్పు బ్రూడ్, బార్లీ టీ జోడించుకుని స్నానం కూడా చేయవచ్చు. చర్మానికి శాంతపరుస్తుంది.


☀ బార్లీ టీని ఐస్ క్యూబ్స్ గా చేసి ముఖంపై సున్నితంగా రుద్దుకుంటే వాపు తగ్గుతుంది.


☀ మెరిసే జుట్టు కోసం బార్లీ టీతో శుభ్రం చేసుకోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: జిడ్డు చర్మం వదిలించుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు