ఉక్రెయిన్ పై దాడిచేసి యూరప్‌లో అశాంతిని రగిల్చారు పుతిన్.అరవై తొమ్మిదేళ్ల పుతిన్ కొన్ని నెలలుగా ఉదర క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అలాగే పార్కిన్‌సన్స్ వ్యాధి కూడా ఆయనకు ఉంది. ప్రస్తుతం పుతిన్ ఉదర క్యాన్సర్‌కు సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అసలేంటి క్యాన్సర్? ఎందుకు వస్తుంది? ప్రాణానికి ఎంత ప్రమాదం? 


ఉదర క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
ఉదర క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం పొట్టలోని కణాలు జన్యు మార్పులు చెందడం (జెనెటిక్ మ్యుటేషన్). దీని వల్ల కణాలు వేగంగా పెరిగి కణితుల్లా ఏర్పడతాయి. ఒక వ్యక్తికి ఉదర క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ధూమపానం పెంచుతుంది. అలాగే కుటుంబంలో ఎవరికైనా ఉదర క్యాన్సర్ ఉన్నా కూడా తరువాతి తరాల వారికి వచ్చే అవకాశం ఉంది. 


పూర్తిగా నయమవుతుందా?
ఉదర క్యాన్సర్ ఒక్కసారి వస్తే పూర్తిగా నయం చేయడం కుదరదే. కానీ నియంత్రణలో ఉంచగలరు. దీనికి కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీలు అవసరం పడతాయి. ఇవన్నీ చేయడం వల్ల మరి కొన్నేళ్లు బతికే అవకాశాలను పెంచుతారు వైద్యులు. సర్జరీ ద్వారా క్యాన్సర్ కణజాలాన్ని తొలగించగలిగితే కొన్నాళ్ల పాటూ రోగి బతికే ఛాన్సు ఉంది. అయితే తిరిగి ఆ ప్రాంతంలో క్యాన్సర్ రీలాప్స్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. 


లక్షణాలు ఎలా ఉంటాయి?
1. పొట్ట ప్రాంతంలో ఇబ్బందిగా ఉంటుంది. 
2. ఏదైనా మింగడంలో అసౌకర్యంగా అనిపిస్తుంది. 
3. తిన్నాక పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. 
4. కాస్త ఆహారం తిన్నా కూడా పొట్ట నిండినట్టు అవుతుంది. 5. గుండెల్లో మంటగా అనిపిస్తుంది. 
6. ఆహారం అరగకుండా అజీర్తి సమస్య మొదలవుతుంది. 
7. వికారంగా అనిపిస్తుంది. 
8. పొట్ట నొప్పి
9. క్రమంగా బరువు తగ్గిపోతారు. 


ఎన్నాళ్లు  బతికే ఛాన్స్?
ఉదర క్యాన్సర్ ఏ స్థాయిలో గుర్తించారన్న దానిపై బతికే ఛాన్సు ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్ పొట్ట లోపల నుంచి బయటికి కనిపించేలా వ్యాపించక ముందే గుర్తించి చికిత్స తీసుకుంటే అయిదేళ్ల పాటూ జీవించే అవకాశం 70 శాతం ఉంటుంది. అదే క్యాన్సర్ పక్క అవయవాలకు, లింఫ్ నోడ్స్ కు కూడా సోకితే అయిదేళ్ల పాటూ జీవించే అవకాశం 32 శాతమే. గణాంకాల ప్రకారం చూస్తే ప్రతి వందమంది ఉదర క్యాన్సర్ రోగుల్లో 45 మంది ఒక సంవత్సరానికి పైగా జీవించారు. వందమందిలో 20 మంది అయిదేళ్లకు మించి బతికిన వారు ఉన్నారు. పుతిన్ క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉందో వివరాలు బయటికి రానీయడం లేదు. కాబట్టి ఇతని జీవితకాలం ఎంతో చెప్పలేం. అయితే పరిస్థితి సర్జరీ దాకా చేరిదంటే వ్యాధి ముదిరిందని అర్థం చేసుకోవాలి.  


Also read: మూడో బిడ్డను కంటే పదకొండున్నర లక్షల రూపాయల బోనస్, ఓ కంపెనీ బంపర్ ఆఫర్


Also read: హైబీపీ, షుగర్ ఉందా? ఉల్లికాడలను వంటల్లో భాగం చేసుకోండి