ఆకుపచ్చగా ఉండే ఉల్లికాడలను ఆకు కూరల జాబితాలోకే వేసుకోవాలి. ఆకుకూరలతో ఎన్నో లాభాలు ఉంటాయో వీటితో కూడా అన్నే లాభాలు కలుగుతాయి. అదనంగా ఉల్లిపాయల్లో ఉండే సుగుణాలు కూడా వీటి ద్వారా శరీరాన్ని చేరుతాయి. అందుకే ఉల్లిపాయల కన్నా, ఆకుకూరల కన్నా ఇవి రెండింతలు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎందుకో తెలియదు కానీ చాలా మంది ఉల్లికాడలను ఇష్టపడరు. వాటిని వంటలో భాగం చేయరు. నిజానికి అన్నింటికన్నా రోజూ వాడాల్సింది వీటిని. ఇవి కూరలకు అదనపు రుచిని, లుక్ ను అందిస్తాయి. బిర్యానీల్లో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. 


బ్యాక్టిరియాలకు చెక్
బ్యాక్టిరియాలను తగ్గించే గుణం ఉల్లికాడల్లో అధికం. వీటిలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికం. అందుకే బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లు త్వరగా దాడి చేయకుండా కాపాడతాయి. జ్వరం వంటివి ఉల్లికాడలు తినడం త్వరగా తగ్గుతాయి. జలుబు, దగ్గు వంటివి త్వరగా దాడి చేయవు. సీజనల్ వ్యాధులను తట్టుకునే శక్తి కూడా శరీరానికి అందుతుంది. అందుకే వేసవిలో కచ్చితంగా తినాల్సినవి ఉల్లి కాడలే. 


ఇంకా ఎన్నో ప్రయోజనాలు
1.ఉల్లికాడలు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్, మలబద్ధకం వంటివి కలగవు. 
2. క్యాన్సర్ ను అడ్డుకునే శక్తికి కూడా ఉల్లికాడలకు ఉంది.  కాబట్టి ప్రతి రెండు రోజులకోసారి ఉల్లికాడలను ఏదో ఒక ఆహారం రూపంలో తీసుకోవాలి. 
3. ఉల్లికాడల్లో ఉండె కెమోఫెరోల్ అనే ఫ్లేవనాయిడ్ హైబీపీ రాకుండా అడ్డుకుంటుంది. ఇది రక్తనాళాలలో రక్తసరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది. రక్తనాళాల గోడలపై ఎలాంటి ఒత్తిడి పడనివ్వదు. కాబట్టి బీపీ పెరిగే అవకాశం ఉండదు.హైబీపీతో బాధపడుతున్న వారు ఉల్లికాడలను రోజూ తింటే చాలా మంచిది.
4. ఉల్లికాడలు తినడం వల్ల తక్కువ కేలరీలు, కొవ్వు శరీరంలో చేరుతాయి కాబట్టి అధిక బరువు సమస్యా కూడా లేదు. 
5. వీటిలో జియాంటాంటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది  కంటిచూపును మెరుగుపరుస్తుంది. 
6. ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. కాలేయం చుట్టూ పేరుకుపోయిన అదనపు కొవ్వును ఇది తగ్గిస్తుంది. 
7. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ కె వంటి  విటమిన్లతో పాటూ మెగ్నిషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీస్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. 
8. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేసే ఆకుకూర ఉల్లికాడలు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శక్తిని పెంచుతుంది. 


Also read: వామ్మో ఈ కుక్కేంటి గ్రహాంతరవాసిలా ఇంతుంది? వీడియో చూడండి


Also read: షిగెల్లా బ్యాక్టిరియా వల్ల మనదేశంలో తొలి మరణం? జాగ్రత్త ఈ బ్యాక్టిరియా అంటువ్యాధి