స్ట్రోక్ అంటే మెదడుకు వచ్చే ఎటాక్. గుండెకు పోటు ఎలాగో, మెదడుకు స్ట్రోక్ అలాగన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైనది. మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు, మెదడులోని రక్తనాళం పగిలినప్పుడు ఇది వస్తుంది. స్ట్రోక్ వచ్చాక మెదడులోని కొన్ని భాగాలు దెబ్బతినడం, అక్కడి కణాలు పూర్తిగా మరణించడం జరుగుతుంది. దీని వల్ల శరీరంలో కొన్ని భాగాలు పూర్తిగా పనిచేయడం మానేస్తాయి. ఒక్కోసారి రోగికి మరణం కూడా సంభవిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ చాలా ప్రమాదకరమైనది. అయితే ఇది రావడానికి కొన్ని నెలల ముందు నుంచే కొన్ని సంకేతాలను చూపిస్తుంది. వాటిని తేలికగా తీసుకుంటే స్ట్రోక్ వచ్చాక ప్రాణం మీదకు వచ్చే పరిస్థితి వస్తుంది. 


ఇలా అయితే జాగ్రత్త...
ముఖ్యంగా స్ట్రోక్ రావడానికి ముందు మైకంలా వచ్చి కొంతమంది కళ్లు తిరిగి పడిపోతారు. దీన్ని నీరసంగా చాలా మంది కొట్టి పడేస్తారు. నిజానికి ఇది స్ట్రోక్ వచ్చే ముందు కలిగేది కూడా కావచ్చు. అలాగే వెర్టిగో కూడా వచ్చే అవకాశం ఉంది. వెర్టిగో వస్తే తల తిరిగినట్టు అయిపోతుంది. ఇలా స్ట్రోక్ రావడానికి కొన్ని రోజుల ముందు లేదా కొన్ని నెలల ముందు అయ్యే అవకాశం ఉంది. వెర్టిగో వచ్చినా, మైకంలా వచ్చి కళ్లు తిరిగి పడిపోయినా వైద్యుడిని సంప్రదించి బ్రెయిన్ స్కాన్ చేయించుకోవడం ఉత్తమం. 


స్ట్రోక్ అసోసియేషన్ చెప్పిన ప్రకారం  కొన్నిసార్లు ఈ లక్షణాలు స్ట్రోక్ సంభవించే ముందు లేదా తర్వాతబయటపడవచ్చు. అవి స్ట్రోక్ రావడానికి ముందు సంభవించినప్పుడు, అవి తాత్కాలిక ఇస్కీమిక్ అటాక్ (TIA)కి సంకేతం. మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు  ఇస్కీమిక్ అటాక్ (TIA)కి దారి తీయవచ్చు.దీని వలన మెదడులో కొంతసేపు ఆక్సిజన్ కొన్ని భాగాలకి సరఫరాల కాదు.


ఇతర సంకేతాలు
వెర్టిగో,  మైకము కాకుండా ఇతర సంకేతాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా స్ట్రోక్ రాకను చెప్పే లక్షణాలే. 
1. చేతులు బలహీనంగా మారడం
2. కాళ్ల, చేతుల్లో పక్షవాతం రావడం
3. సరిగా మాట్లాడలేకపోవడం
4. తీవ్రమైన తలనొప్పి
5. చూపు మసకబారడం
6. జ్ఞాపకశక్తి కోల్పోవడం


ఈ లక్షణాలు కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటల పాటూ  ఉండి, తరువాత పోతాయి. కానీ ఇవి సమీప భవిష్యత్తులో వచ్చే స్ట్రోక్ లక్షణాలని గుర్తుపెట్టుకోండి. వెంటనే వైద్యుడిని కలిసి జాగ్రత్తపడండి. ముఖంలో ఒకవైపు లాగినట్టు అవ్వడం,నోరు వంకర అవ్వడం అయితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. 


Also read: దీపావళికి ఈ కూరగాయ వండుకుని తింటే సంపదే కాదు, ఆరోగ్యమూ కలిసొస్తుంది









గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.