నిద్ర లేచిన వెంటనే అందరికీ బద్ధకంగా, నిద్ర మత్తుగానే ఉంటుంది. అందరూ మెలకువ వచ్చిన వెంటనే యాక్టివ్ గా ఉండలేరు. కొంతమందికైతే మరింత నిద్ర మత్తులో ఉండడం వల్ల వారి రోజువారి పనుల మీద కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది. పొద్దున్నే చేసే కొన్ని పనులు మన రోజు ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంటాయి.
అలారమ్ ఆపెయ్యడం
పొద్దున్నే అలారం మోగగానే మెలకువ వస్తుంది. కానీ ఇంకాసేపు మంచం దిగడం ఇష్టం లేక దాన్ని అలాగే ఆపెయ్యడం దాదాపు అందరికీ అలవాటుగా ఉంటుంది. పది నిమిషాల్లో అలారం మళ్లీ మళ్లీ స్నూజ్ చేస్తున్నారంటే మాత్రం అది మీ డిస్టర్బ్ డ్ స్లీప్ సైకిల్ కి నిదర్శనం. దీని కంటే కూడా ఒక కచ్చితమైన సమయాన్ని నిర్ధారించుకుని అలారం మోగినపుడు నిద్ర లేచేందుకు సిద్ధంగా ఉండడమనేది మంచి పద్ధతి.
స్కిప్పింగ్ బ్రేక్ ఫాస్ట్
బ్రేక్ ఫాస్ట్ అనేది చాలా ముఖ్యమైన భోజనం. దీన్ని స్కిప్ చెయ్యడం వల్ల శక్తి తగ్గిపోతుంది. దృష్టి కూడా తగ్గుతుందట. అంతేకాదు తర్వాత తీసుకునే ఆహారం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసినపుడు ఎక్కువగా తినేస్తారట. మనసు, శరీరాలను రెజువనేట్ చేసేందుకు బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ సమతులంగా ఉండేట్టు జాగ్రత్త పడాలి.
ఫోన్ చెకింగ్
పొద్దున్న నిద్ర లేవగానే ఫోన్ చెక్ చేసే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. ఇలా పొద్దున్నే సోషల్ మీడియా స్క్రోల్ చెయ్యడం లేదా మెయిల్స్ చెక్ చేసుకోవడం వంటి చర్యలతో అంతకంటే కూడా అర్థవంతమైన పనులు చెయ్యకుండా ఆగిపోతాము. లేవగానే పోన్ చూడాలి అనే టెంప్టేషన్ కు దూరంగా ఉండాలి. ఫోన్ చూడటానికి బదులుగా లేచి ప్రెషప్ కావడం, వర్కవుట్ లేదా మెడిటేషన్ లేదా ఏదైనా చదవడం వంటి పనులు మంచిది. ఇవి మనసును తాజాగా, చురుకుగా ఉంచుతాయి.
వ్యాయామం
ఉదయాన్నే ఏదో ఒక రకమైన వ్యాయామం చెయ్యడం తప్పనిసరి. రోజు పొద్దున్నే చిన్న పాటి వ్యాయామం చెయ్యడం వల్ల మానసిక స్థితి ఉల్లాసంగా మారుతుంది. శరీరంలో శక్తిస్థాయిలు పెరగడం వల్ల శారీరక పనితీరు మెరుగుపడుతుంది. ఉదయాన్నే తాజాగా ఉత్సాహంగా ఉంటుంది. వీలైనంత వరకు పొద్దటి వ్యాయామం వాయిదా వెయ్యకూడదు. చిన్న పాటి శారీరక కదలికలు, స్ట్రెచెస్, కొద్ది పాటి నడక వంటి వాటిని ఉదయపు వ్యాయామాలుగా ఎంచుకోవచ్చు.
ఉదయాన్నే హడావిడి వద్దు
రోజును ఎప్పుడూ హడావిడిగా ప్రారంభించకూడదు. ఇది ఒత్తిడికి కారణం అవుతుంది. రోజు అస్తవ్యస్తంగా మారుతుంది కూడా. పొద్దున్న నిద్ర లేవడం ఒక్క పదినిమిషాలు ముందుగా చేస్తే ఉదయాన్ని ఉల్లాసంగా మొదలు పెట్టుకోవచ్చు. ఆఫీసుకు వేసుకునే డ్రెస్, షూపాలీష్ చేసుకోవడం వంటి చిన్నచిన్న పనులు ముందురోజు రాత్రే చేసి పెట్టుకుంటే మంచిది. ఇవి పొద్దున హడావిడి లేకుండా ఉంటుంది.
Also read : రోజూ రాత్రిపూట ఇలా జరుగుతోందా? జాగ్రత్త, క్యాన్సర్ కావచ్చు - డాక్టర్‌ను సంప్రదించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial