నల్ల నేరేడు పండ్లు నిగనిగలాడుతూ ఉంటాయి. చెట్లు నుండి గుత్తులుగా రాలి కింద పడతాయి. వాటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల నేరేడులాగే తెల్ల నేరేడు పండ్లు కూడా ఉన్నాయి. ఆకారంలో వాటికి కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ ఆరోగ్య పోషకాలు అందించడంలో మాత్రం వాటికి మించినవి. వీటిని రోజ్ ఆపిల్ అని పిలుస్తారు. అలాగే వైట్ జామున్ అని కూడా అంటారు. ఇది ఒక ఉష్ణ మండల పండు. అంటే కేవలం వేసవికాలంలోనే పండుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉష్ణ మండల ప్రాంతాల్లో ఇది లభిస్తుంది. వీటి ఆకారం గంటలా ఉంటాయి. ఈ పండ్లు లేత తెలుపు, ఆకుపచ్చ కలిపిన చర్మంతో ఉంటాయి. పలుచటి చర్మాన్ని తీస్తే లోపల తెల్లటి గుజ్జు ఉంటుంది. ఇది చాలా జ్యూసీగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు ఎంతో. 


తెల్ల నేరేడు పండ్లను కుప్పలుగా పోసి మార్కెట్లో అమ్ముతున్నారు. ఇవి కనిపిస్తే కచ్చితంగా తినాలి. ఎందుకంటే ఇవి సీజనల్ ఫ్రూట్.  వీటిలో ఆ సీజన్లో వచ్చే రోగాలను తట్టుకునే శక్తిని శరీరానికి ఇస్తాయి.  ఈ తెల్ల నేరేడు పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. దీనిలో డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఈ పండు తినడం వల్ల శరీరానికి అందే కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లు ఎన్ని తిన్నా కూడా బరువు పెరుగుతామనే బెంగ లేదు. అందుకే దీన్ని చిరుతిండిగా తినవచ్చు. సలాడ్లు, డిసర్ట్ లలో ఈ తెల్ల నేరేడు పండ్లను వేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.


ఆయుర్వేదంలో కూడా తెల్ల నేరేడు పండ్ల ప్రస్తావన ఉంది. వీటిని తినమని ఆయుర్వేదం కూడా సూచిస్తుంది. ఈ పండ్లు వేసవికాలంలో తినడం వల్ల శరీరానికి శీతలీకరణ లక్షణాలు అందుతాయి. అంటే వడదెబ్బ నుంచి కాపాడతాయి. వేడి సంబంధ అనారోగ్యాలను దూరంగా ఉంచుతాయి. శరీరంలో వేడిని తగ్గించి ఆరోగ్యాన్ని అందిస్తాయి. డీహైడ్రేషన్ బారిన పడినవారు తెల్ల నేరేడును తింటే ఎంతో మంచిది. ఇది అలసట వంటి లక్షణాలను పోగొడతాయి. వీటి రుచి తీయగా ఉంటుంది. పిల్లలకు కూడా నచ్చుతాయి. తాజాగా ఈ పండ్లను తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువ. కాబట్టి వీటిని తినడం వల్ల వేసవిలో బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే చాలా రోగాలు తగ్గుతాయి. సమతుల ఆహారాన్ని శరీరానికి అందించాలనుకుంటే వేసవికాలంలో వారానికి కనీసం నాలుగు నుంచి ఐదు తెల్ల నేరేడు పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి.


Also read: పొడవాటి జుట్టు కోసం మందార పువ్వులు ఆకులతో ఇలా చేయండి



Also read: సోమవారాలే అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం, ఎందుకో తెలుసా?































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.