మనిషి ఆరోగ్యానికి ప్రోటీన్ ఎంతో ముఖ్యం. మనిషి బరువును బట్టి వారి కావాల్సిన ప్రొటీన్ ఆధారపడి ఉంటుంది. కిలో శరీరబరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్ అవసరం. కాబట్టి మీ బరువును బట్టి మీకెంత ప్రొటీన్ అవసరమో లెక్క వేసుకోవచ్చు. బరువు తగ్గేందుకు, కండరాల నిర్మాణానికి, కణాల రిపేర్ చేయడానికి ప్రొటీన్ చాలా అవసరం. అయితే ప్రొటీన్ అధికంగా ఆహారాన్ని అపరిమితంగా తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి. 


దాహం పెరుగుతుంది
శరీరంలో ప్రొటీన్ అధికంగా చేరితే దాహం పెరుగుతుంది. అధిక ప్రొటీన్ వల్ల శరీరానికి ఎక్కువ నీరు కావాల్సి వస్తుంది. దాని వల్ల విపరీతమైన దాహం వేస్తుంది. దీనికి కారణం ప్రొటీన్లో ఉండే నత్రజని. ఇది అధికంగా రక్తంలో చేరడం వల్ల ఇలాంటి మార్పులు కలుగుతాయి. దీని వల్ల మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది. వ్యర్థాలను బయటకు పంపేందుకు అధికంగా కష్టపడాల్సి వస్తుంది. ఎంత నీరు తాగిన శరీరానికి సరిపోదు. దీనివల్ల శరీరం బలహీనంగా మారిపోతుంది. తలనొప్పి ఎక్కువైపోతుంది. బరువు తగ్గి సన్నగా మారిపోతారు. 


దుర్వాసన 
ఆహారంలో అధిక ప్రొటీన్ ఉంటే శ్వాస నుంచి దుర్వాసన మొదలవుతుంది. ఆ వాసన ఎంత భయంకరంగా ఉంటుందంటే కుళ్లిన పండ్లలా అనిపిస్తుంది. ప్రొటీన్లో ఉండే రెండు ఆమ్లాల వల్లే ఈ దుర్వాసన వస్తుంది. ఇందుకోసం కూడా అధికంగా నీళ్లు తాగాల్సి వస్తుంది. 


మలబద్ధకం
ప్రొటీన్ శరీరంలో అధికమైతే మలబద్ధకం సమస్య కూడా ఎక్కువవుతుంది. కార్బోహైడ్రేట్లు తగ్గి, ప్రొటీన్ పెరిగితే మాత్రం ఈ సమస్య మరీ తీవ్రంగా మారుతుంది. ప్రొటీన్ ఉండే ఆహారం అధికంగా తిన్నామనిపిస్తే, కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని అధికంగా తినాలి.


ప్రొటీన్ అధికంగా ఉండే పదార్థాలు...
కొన్ని ఆహారాల్లో ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది. మటన్, చికెన్, గుడ్లు , చేపలు, రొయ్యలు, పాలు, పెరుగు, చీజ్, నట్స్ (బాదం, జీడిపప్పు,వాల్నట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సన్ ఫ్లవర్ గింజలు, టోఫు, అన్ని రకాల బీన్స్, శెనగలు... వీటన్నింటిలో ప్రొటీన్ ఉంటుంది.


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: ప్రపంచంలో పరమ బోరింగ్ ఉద్యోగాలు ఇవే, పరిశోధనలో తేల్చిచెప్పిన సైకాలజిస్టులు



Also read: రోజూ పాలు తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా? నిపుణులు ఏమంటున్నారు?