బోరింగ్ అంటే? సామాజిక, వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి జోష్ లేకుండా నెమ్మదిగా, రొటీన్‌గా సాగుతుంటే ఆ పరిస్థితి బోరింగ్ గానే ఉంటుంది. చేసే ఉద్యోగం కూడా జీవితాల్లో బోరింగ్ ను అధికంగా నింపుతుందని చెబుతున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్ కు చెందిన సైకాలజీ పరిశోధకుల బృందం ప్రపంచంలోని ఏ ఉద్యోగాలు పరమ బోరింగో తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం ఏ లక్షణాలను ‘బోరింగ్’గా పరిగణిస్తారో ముందుగానే సిద్ధం చేసుకున్నారు. వారి సాయంతో సర్వే చేసి బోరింగ్ ఉద్యోగాలను కనిపెట్టారు. వాటిలో టాప్ 5 లో ఉన్న ఉద్యోగాల జాబితాను విడుదల చేశారు. ఈ అధ్యయనానికి డాక్టర్ విజ్నాంద్ వాన్‌టిల్‌బర్గ్ నాయకత్వం వహించారు. 


ఆ ఉద్యోగాలు ఇవే..
పరిశోధనలో అయిదు రకాల ప్రయోగాలలో 500 మంది వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్న వారి జీవనశైలిని తెలుసుకున్నారు. వారు చెప్పిన దాన్ని ప్రకారం ఓ డేటా సిద్ధం చేశారు. దాన్ని బట్టి అయిదు పరమ బోరింగ్ ఉద్యోగాలేంటో తేల్చి చెప్పారు. 


1. డేటా అనలిస్టు
2. అకౌంటింగ్ అండ్ టాక్స్ కన్సల్టెన్సీ ఉద్యోగులు
3. క్లీనింగ్ రంగంలోని వారు
4. బ్యాంకింగ్ ఉద్యోగులు
5. ఫైనాన్స్ ఉద్యోగులు
పైన చెప్పిన ఉద్యోగాలు మూసగా ఉంటాయని, ఎలాంటి కొత్తదనం ఉండదని తేల్చి చెప్పారు పరిశోధకులు. ఈ ఉద్యోగాల్లో మీరూ ఉన్నారా? మీకు కూడా లైఫ్ బోరింగ్ అనిపిస్తోందా? ఒకసారి చెక్ చేసుకోండి. లైఫ్ లో మరింత జోష్‌ను నింపుకునేందుకు ప్రయత్నించండి.


ఇంట్రస్టింగ్ ఉద్యోగాలు...
అలాగే ప్రతి దినం కొత్తగా, ఉద్యోగుల్లో జోష్ నింపే జాబ్‌లను కూడా పరిశోధకులు చెప్పారు. 


1. కళలు (సినిమానటులు, ఆర్టిస్టులు)
2. సైన్సు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు
3. జర్నలిస్టులు
4. టీచర్లు 


బోరింగ్ హాబీలు ఇవే...
హాబీ అంటే కొత్తగా ఉండాలి. చాలా కొద్ది మందికే చాలా ఆసక్తికరమైన హాబీలు ఉంటాయి. సర్వేలో పరమ బోరింగ్ హాబీలను కూడా కనిపెట్టారు పరిశోధకులు. నిద్రపోవడం, టీవీ చూడడం, జంతువులను చూడడం, గణితం చేయడం, మతపరమైన పనులు వంటివి పరమ బోరింగ్ హాబీలుగా గుర్తించారు. ఇలాంటి హాబీల వల్ల పెద్దగా లాభం లేదని, కాస్త ఇన్నోవేటివ్ గా అలవాట్లు ఉంటే వారి జీవితం ఎంతో కొత్తగా, ఉత్సాహంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి లైఫ్ బోర్ కొట్టకుండా ఉండాలంటే మీలోనే మార్పు మొదలవ్వాలి.


Also read: రోజూ పాలు తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా? నిపుణులు ఏమంటున్నారు?


Also read: షాకింగ్ ఆవిష్కరణ, మనుషుల హార్ట్ బీట్‌ను వినగలిగే ఫ్యాబ్రిక్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలు