నం ఏదైనా కష్టపడి పని చేస్తాం కానీ అందులో విజయం సాధించలేదంటే మాత్రం.. ఏం చేస్తాం అదృష్టం లేదులే.. అది మనకి రాసిపెట్టి లేదు అందుకే ఇలా జరిగిందని అనుకుంటారు. చేతి దాకా వచ్చి నోటి దాకా రాకపోయినా అదృష్టం లేదని తిట్టుకుంటారు. జాతకం బాగుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అదృష్టం వరిస్తుందని చెప్తూ ఉంటారు. ఈ విషయాలు చాలా మంది నమ్ముతారు కూడా. ఏదైనా సాధిస్తే అది అదృష్టం వల్లే కలిసొచ్చిందని పెద్దలు కూడా అంటారు. కానీ అదంతా ట్రాష్ అని మరికొంతమంది కొట్టే పడేస్తారు. కష్టే ఫలి అంతే కానీ అదృష్టంతో సంబంధం లేదని వాదిస్తారు. కానీ ఈ ఆహారాలను మీ డైట్లో భాగం చేసుకుంటే అదృష్టం మీ వెంటే అంటున్నారు కొంతమంది. ఇవి తీసుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కలిసి వస్తాయని పూర్వకాలం నుంచి నమ్ముతున్నారు. మరి మీకు అదృష్టాన్ని తెచ్చే ఆ ఆహారాలు ఏంటో ఓసారి చూసేద్దామా..!


మామిడి   


మామిడి లక్ష్మీ దేవితో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే మామిడాకులు, పండ్లు తరచూ నైవేద్యంగా పూజలకి ఉపయోగిస్తారు. పూజా కలశాన్ని తయారు చేయడానికి కూడా మామిడాకులే పెడతారు. బెల్లం, కొబ్బరికాయలతో పాటు మామిడి తినడం వల్ల జీవితంలో ఆనందం, సంతోషం లభిస్తుందని నమ్ముతారు. తినడానికి ఎంతో రుచికరంగా కూడా ఉంటాయి. మామిడి పండ్లు తినడం, నైవేద్యంగా ఇవ్వడం లేదా దానం చెయ్యడం వల్ల అదృష్టం పొందవచ్చని నమ్ముతారు.


నెయ్యి


భారతీయుల ఇళ్ళల్లో నెయ్యి లేకుండా ఏ పని జరగదు. భారతీయ సంస్కృతి, హిందూ పురాణాల్లో నెయ్యి ఒక భాగం. ఎన్నో యుగాల నుంచి నెయ్యిని పూజల్లో ఉపయోగిస్తున్నారు. నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల శ్రేయస్సు పొందుతారని నమ్మకం. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను నెయ్యితో దీపం వెలిగించడం వల్ల దూరమవుతాయని నమ్ముతారు.


లవంగం


బ్యాగ్లో కొన్ని లవంగాలు ఉంచుకుని ప్రత్యేకమైన పని కోసం వెళ్లేటప్పుడు, వాటిని నమలడం వల్ల అదృష్టం వస్తుందని నమ్ముతారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? అయితే కొద్దిగా లవంగాలు మీ వెంట తీసుకెళ్ళి చూడండి. మీరు సక్సెస్ అవుతారో లేదో తెలిసిపోతుంది.


దాల్చిన చెక్క


దాల్చిన చెక్క ఒక మాయా మసాలా అని చాలా మంది నమ్మకం. దీని మీ పర్సులో ఉంచుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడానికి ముడిపడి ఉంటుందని అంటారు. ఇది మీ పర్స్ లో పెట్టుకోవడం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గించడంలో సహాయపడుతుందట.


ఎర్ర మిరపకాయలు


భారతీయ సంస్కృతుల ప్రకారం ఎర్ర మిరపకాయలు లేదా పచ్చి మిరపకాయలు చెడు దృషి, దుష్ట శక్తలు ప్రభావాలను తొలగిస్తుందని నమ్ముతారు. అందుకే ఇంటి గుమ్మాలకి, వాహనాలకు నారా దిష్టి తగలకుండా మిరపకాయలు, నిమ్మకాయలు కలిపి కట్టి వేలాడదీస్తారు. అవి నల్లగా అయితే ఏదో అరిష్టం జరుగుతుందని భావిస్తారు. అందుకే అవి వాడిపోగానే కొత్త వాటిని తగిలిస్తూ ఉంటారు.


చేప


వినడానికి వింతగా ఉన్నప్పటికీ చేప వల్ల కూడా అదృష్టం వస్తుందట. భారతీయ సంస్కృతులలో చేపలను తినడం లేదా వేరొకరికి ఇవ్వడం వల్ల శ్రేయస్సు, ఆనందం లభిస్తుందని నమ్ముతారు. బెంగాలీ సంస్కృతి ప్రకారం వివాహ సమయంలో చేపలు బహుమతిగా కూడా ఇచ్చుకుంటారు. ఇది ఆనందం, వైవాహిక ఆనందాన్ని ఇస్తుందని అంటారు.


పప్పులు(lentils)


కొన్ని సంస్కృతుల ప్రకారం కాయధాన్యాల గుండ్రని ఆకారం ఆర్థిక ఆనందంతో ముడిపడి ఉంటుంది. వాటిని తినడం, దానం చేయడం వల్ల అదృష్టం, ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని అనుకుంటారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: జిడ్డు, మొటిమలతో విసిగిపోయారా? బొగ్గు పొడితో ఇలా చేయండి


Also read: ఉదయం పూట ఈ పానీయాలు తాగితే కొవ్వు కరగడం ఖాయం