Coffee Scrubs for Healthy Skin : హెల్తీ స్కిన్కోసం పార్లర్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. వంటగదిలోకి వెళ్లిన చాలు. అక్కడే దొరికే ఎన్నో పదార్థాలు మీ స్కిన్ కేర్ రోటీన్లో చేర్చుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాఫీ. అవును కాఫీ పౌడర్‌తో మీరు మెరిసే చర్మం పొందుకోవచ్చు. అయితే కాఫీ పౌడర్‌లో కొన్ని కలిపి తీసుకుంటే మీరు మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఇది కేవలం ముఖానికే అనుకుంటే పొరపాటే. కాఫీ పౌడర్‌తో చేసుకునే అన్ని స్క్రబ్‌లను మీరు పూర్తి శరీర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు.
మీరు ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని పొందాలనుకుంటే కాఫీ స్క్రబ్‌లను ప్రయత్నించవచ్చు. పిగ్మెంటేషన్‌ను తగ్గించి.. సహజమైన ఎక్స్‌ఫోలియేట్‌గా చేస్తాయి. చర్మంపై పేరుకుపోయిన మృత చర్మ కణాలను సున్నితంగా తొలగిస్తాయి. ఇవి మీ ఛాయను మెరుగుపరుస్తాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది మీ స్కిన్ మెరిసేలా చేస్తుంది. చర్మాన్ని బిగుతుగా, ముడతలు లేకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది.ఈ స్క్రబ్ల నుంచి వచ్చే సువాసన మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అయితే కాఫీ పౌడర్‌లో ఎలాంటి పదార్థాలు కలిపితే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనెతో..
ఓ గిన్నెలో కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను కలిపి చర్మానికి అప్లై చేయండి. సున్నితంగా రెండు నిముషాలు చర్మంపై స్క్రబ్ చేయండి. అనంతరం గోరువెచ్చని నీటితో మీరు శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనిని మీరు వారంలో రెండు సార్లు ఉపయోగించవచ్చు.
పంచదారతో..
కాఫీ పౌడర్‌లో పంచదార, కొబ్బరినూనె వేసి బాగా కలపండి. దీనిని కూడా మీరు శరీరానికి బాగా అప్లై చేయవచ్చు. దీని చర్మంపై అప్లై చేసి.. రెండు నిమిషాలు స్క్రబ్ చేయండి. దీనిని కూడా వారానికి రెండు సార్లు అప్లై చేయవచ్చు
ఆలివ్ ఆయిల్‌తో
కాఫీ పౌడర్‌తో ఆలివ్ ఆయిల్ కలిపి చర్మానికి అప్లై చేస్తే మీరు మెరిసే చర్మాన్ని పొందవచ్చు. స్కిన్ మీద ఉండే మృతకణాలు తొలగించడంలో ఇది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. దీనిని కూడా మీరు వారంలో రెండు మూడుసార్లు ఉపయోగించవచ్చు.
తేనెతో కలిపి..
కాఫీలో తేనె కలిపి దీనిని శరీరానికి అప్లై చేస్తే పొడి చర్మం దూరమవుతుంది. అంతేకాకుండా చర్మానికి పూర్తి మాయిశ్చరైజర్ అందుతుంది. దీనిని మీరు శరీరం మొత్తానికి అప్లై చేయవచ్చు. పావు గంట మీరు దానిని అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు.
కాఫీని మీరు పెరుగు, ఆల్మండ్ ఆయిల్, అవకాడో, జోజోబా ఆయిల్, షియా బటర్ వంటి వాటితో కలిపి స్క్రబ్ చేయవచ్చు. ఈ పదార్థాలను కూడా మీరు కాఫీతో కలిపి స్క్రబ్ చేయవచ్చు. మీరు స్నానానికి రెండు నిమిషాల ముందు బాగా మసాజ్ చేసుకుని స్కిన్ బెనిఫిట్స్ పొందవచ్చు. మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. మంచి ఫలితాల కోసం మీరు వీటిని రెగ్యూలర్‌గా ఉపయోగించుకోవచ్చు. అయితే మీరు వీటిని ఉపయోగించుకునే ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.
Also Read : ఈ మౌత్ వాష్లను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి