Homemade Mouthwash Making Process : నోటి శుభ్రతలో ఎలాంటి నిర్లక్ష్యం తీసుకున్నా.. అది వెంటనే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఓరల్ హెల్త్‌లో ఎప్పుడు కాంప్రిమైజ్ కాకూడదు. అలా అని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం కొందరికి కష్టంగానే ఉంటుంది. అలాంటివారు ఇంట్లోనే మౌత్‌వాష్‌లు తయారు చేసుకోవచ్చు. వంటింట్లో దొరికే వాటితో దంత సంరక్షణలో ఎఫెక్టివ్‌గా పనిచేసే, ఎలాంటి హానికరమైన రసాయనాలు లేని మౌత్‌వాష్‌లు స్వయంగా తయారు చేయవచ్చు. ఇవి మీ డబ్బును ఆదా చేయడమే కాకుండా.. సహజంగా మీ దంతాలను రక్షిస్తాయి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే మౌత్ వాష్‌లు ఏంటో.. వాటిని ఎలా తయారు చేయాలో.. ఏ సమస్యకు దేనిని ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నోటి పూత ఉన్నప్పుడు పసుపుతో..
పసుపు ప్రతి ఇంట్లో ఉంటుంది. దీనితో తయారు చేసిన మౌత్ వాష్ ఉపయోగిస్తే మీకు నోటి పూత, అల్సర్ వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా చిగుళ్ల వాపును తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఈ మౌత్ వాష్ తయారు చేయడం కోసం 4 లవంగాలను కప్పు నీటిలో నానబెట్టాలి. దానిలో పసుపు, అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలపాలి. అంతే మౌత్ వాష్ ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంది. దీనిని నోట్లో వేసుకుని కనీసం 30 సెకన్లు పొక్కిలించి.. ఉమ్మేయాలి. ఇలా రెగ్యూలర్‌గా చేస్తే నోటి అల్సర్ సమస్య దూరమవుతుంది.
పంటి నొప్పి ఉన్నప్పుడు సాల్ట్ వాటర్
పంటి నొప్పిని తగ్గించుకోవడంలో దీనిని ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. సాల్ట్ వాటర్ నొప్పిని, చిగుళ్ల వాపును తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఉప్పులోని సోడియం కంటెంట్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియాతో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. దంతాల నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. టేబుల్ స్పూన్ ఉప్పును.. గ్లాస్ నీటిలో కలిపితే సాల్ట్ వాటర్ మౌత్ వాష్ రెడీ. కానీ దీనిని రెగ్యూలర్‌గా కాకుండా వారంలో రెండు రోజులు చేస్తే సరిపోతుంది.
దంతక్షయకు ఆపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్ చెడు బ్యాక్టీరియాతో పోరాడి దంత క్షయాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే యాపిల్ సైడర్ వెనిగర్‌లో కాల్షియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా ఉంటాయి. ఇది నోటి ఆరోగ్యానికి మద్ధతు ఇస్తుంది. అంతేకాకుండా నోటి దుర్వాసన సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. దీనికోసం మీరు ఒక గ్లాస్ నీటిలో రెండు టేబుల్ స్పూన్ల్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ మౌత్‌వాష్‌ని వారంలో మూడుసార్లు ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు దక్కుతాయి.
నోటి దుర్వాసన ఉంటే కొబ్బరి నూనె
ఆయిల్ పుల్లింగ్ అంటూ ఎన్నో ఏళ్లుగా కొబ్బరి నూనె నోటి సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. కానీ దీనికోసం మీరు ప్యూట్ కొబ్బరి నూనె వాడితే మంచిది. ఇది ఓ ఇంటి నివారణగా కూడా చెప్పవచ్చు. కొబ్బరి నూనెను మీ నోట్లో వేసుకిని పదిహేను నిమిషాలు పొక్కిలించండి. ఇది మీ నోటి సంరక్షణలో ఎన్నో మిరాకిల్స్ చేస్తుంది.
సెన్సిటివిటీని దూరం చేసే సోడా, సాల్ట్
దంతాల సెన్సిటివిటీ చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో సాల్ట్, బేకింగ్ సోడాతో తయారు చేసుకోగలిగే మౌత్ వాష్ మీకు మంచి ఓదార్పు ఇస్తుంది. ఇది యాంటీ బ్యాక్టిరీయల్ లక్షణాలు కలిగి ఉండి మీకు ఉపశమనం అందిస్తుంది. గ్లాస్ నీటిలో అర చెంచా సాల్ట్, అర చెంచా బేకింగ్ సోడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మీరు వారం రోజులు నిల్వ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు దానితో నోటిని శుభ్రం చేసుకోవచ్చు.
చిగురువాపు ఉన్నప్పుడు అలోవెరాతో.. బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నప్పుడు పెప్పర్, లవంగంతో.. తాజా శ్వాస కోసం పిప్పర్ మింట్ ఆయిల్ ఉపయోగించి మౌత్‌వాష్‌లు తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా ఎఫెక్టివ్‌గా పని చేసి దంత సంరక్షణలో మెరుగైన ఫలితాలు ఇస్తాయి.
Also Read : ఛీ ఛీ.. నాచు తినడమేంటి అనుకోకండి.. దీనితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో లెక్కే లేదు