Weight Loss Diet : బరువు తగ్గడానికి వ్యాయామాలతో పాటు.. తీసుకునే ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మీరు 30వ పడిలోకి అడుగుపెడుతున్నప్పుడు జీవక్రియ సహజంగా మందగించడం ప్రారంభమవుతుంది. కాబట్టి మీ డైట్ చార్ట్‌లో కాస్త స్మార్ట్‌గా ఆలోచించి కొన్ని మార్పులు చేస్తే.. మీరు ఈజీగా బరువు తగ్గుతారు. వయసు పెరిగే కొద్ది మనం కొన్నివిషయాలపై అవగాహన తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామనే విషయంపై క్లారిటీ లేకుంటే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
వయసు పెరిగే కొద్ది శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో బరువు తగ్గేందుకు మీరు డైట్ చార్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇది మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేదానిపై క్లారిటీ ఇస్తుంది. తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు తగ్గుతారు. ముఖ్యంగా మీ డైట్లో 5 స్మార్ట్ ఛేంజస్ చేస్తే మీ బరువు మీ అదుపులో ఉంటుంది.
బరువు తగ్గేందుకు మీ డైట్ ఛార్ట్‌లో ఫైబర్, కాల్షియం ఉండాలి. ఈ రెండు పోషకాలు మీరు తినే ఆహారంలో కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఇవి బరువు తగ్గాలనే మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దాని అర్థం ఇతర పోషకాలకు దూరంగా ఉండాలని కాదు. వీటితోపాటు ప్రోటీన్, ఐరన్, పోటాషియం, ఒమేగా-3 వంటి పోషకాలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇదే కాకుండా హైడ్రేటెడ్‌గా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్‌కి దూరంగా ఉండాలి. బరువు తగ్గడం కోసం డైట్ చార్ట్‌లో చేయాల్సిన మార్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైబర్ తీసుకోవడం పెంచండి..
బరువు తగ్గించడంలో ఫైబర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. మీ వయసు పెరిగే సమయంలో ఇది మరింత కీలకంగా వ్యవహరిస్తుంది. మందగిస్తున్న జీవక్రియపై ఇది ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీ డైట్ చార్ట్‌లో ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు చేర్చుకోండి. ఇది బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. టైప్ 2 డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వాటికి దూరంగా ఉండండి..
ప్రాసెస్ చేసిన ఆహారాలకు ఏ వయసు వారైనా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవి మీకు రుచిని అందిస్తాయి కానీ.. ఆరోగ్యానికి మాత్రం హాని చేస్తాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఊబకాయానికి కూడా దారితీస్తాయి. అంతేకాకుండా వీటిని ఎక్కువగా తీసుకునేవారిలో వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. కాబట్టి వాటికి దూరంగా ఉంటూ ఇంట్లో వండుకునే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టండి.
ఫ్యాడ్ డైట్ వద్దు
బరువు తగ్గడంలో ఫ్యాడ్ డైట్ చాలా బాగా పనిచేస్తుంది. కానీ దానివల్ల ఎంత వేగంగా బరువు తగ్గుతారో.. అంతే వేగంగా మళ్లీ బరువు పెరిగిపోతారు. కాబట్టి ఎల్లప్పుడు వేగంగా బరువు తగ్గే డైట్స్ కాకుండా.. సమతుల్యమైన డైట్‌ను ఫాలో అవ్వాలి. శరీరానికి అవసరమైన పోషకాలు ఆ డైట్లో ఉండాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గి.. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు.
కాల్షియం పెంచండి..
వయసు పెరిగే కొద్ది కాల్షియం లోపం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే కాల్షియం కేవలం ఎముకల కోసమే కాదు.. బరువు తగ్గడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీలైనంత కాల్షియం మీ డైట్లో చార్ట్‌లో పొందుపరచుకోండి. బరువుతో పాటు.. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మితంగా తీసుకోండి..
మీకు ఆల్కహాల్ అలవాటు ఉంటే.. పూర్తిగా మానలేని స్థితిలో ఉంటే.. కనీసం వాటిని మితం చేయండి. అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది దానిని ఎంత తగ్గిస్తే అంతమంచిది. దీనిలోని అధిక కేలరీలు మీ బరువు తగ్గించే లక్ష్యాలను అడ్డుకోవడమే కాకుండా.. అనేక అనారోగ్య పరిస్థితులకు కారణమవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు, మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం లేదంటే మితం చేయడం మీ ఆరోగ్యానికి మంచిది.
వీటిని మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే వయసు పెరుగుతున్నా ఫిట్‌గా, ఆరోగ్యంగా, యవ్వన ఛాయలతో ఉంటారు. పోషకాహారంతో పాటు.. మీ ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి సరైన ఫుడ్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. వీలైతే వైద్యుని సంప్రదించి మీ డైట్‌ఛార్ట్ ప్రిపేర్ చేసుకుని ఫాలో అయిపోండి.
Also Read : పండుగ వేళ అన్ని తినేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.