Health Benefits of Tomato: చాలా మంది టమోటాను కూరగాయగా భావిస్తారు. కానీ శాస్త్రవేత్తల దృష్టిలో టమోటా ఒక కూరగాయ కాదు.. పండు. టమోటా ఆహారపు రుచిని పెంచుతుందన్న సంగతి తెలుసు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా టమోటాల్లో 10,000 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. రోమా టమోటాలు, బీఫ్ స్టీక్ టమోటాలు, బ్రాందీవైన్ టమోటాలు, ఆకుపచ్చ టమోటాలు, హెరిటేజ్ టమోటాలు, ద్రాక్ష, చెర్రీ టమోటాలు చాలా ఫేమస్. టమోటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. టమోటాలను నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండెతో సహా ఇతర అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. టమోటాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. 


టమోటాలో ఉండే లైకోపీన్ అనే పదార్థం వల్ల ఎర్రగా ఉంటుంది. ఈ టమోటాలను సలాడ్స్, శాండ్ విచ్ , సూప్ లేదా మసాలాలు లేదా కెచప్, సల్సా వంటి డిప్ లు తయారు చేస్తారు. అంతేకాదు పిజ్జా లేదా పాస్తాలోనూ టమోటా సాస్ ను ఉపయోగిస్తారు. వీటిని స్నాక్స్ లో చేర్చుకుంటారు. టమోటాలను ఎలా తిన్నా వాటిలో ఉండే  ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. 


టమోటా కూరగాయ వర్సెస్ పండు..ఏంటీ గందరగోళం?


మనం టమోటాను కూరగాయ అంటుంటే..శాస్త్రవేత్తలు మాత్రం పండు అంటున్నారు. బొటానికల్ నిర్వచనం ప్రకారం టమోటాలు ఒక పండు. కూరగాయ కాదు. అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం టమోటో విత్తనాలు ఉంటాయి. టమోటాలు రుచికరంగా ఉంటాయి.. కాబట్టి వీటిని కూరగాయలుగా పరిగణిస్తారని అంటున్నారు. అసలు టమోటా కూరగాయనా? పండా ? ఈ గందరగోళానికి సంబంధించి 1893లో డ్యూటీస్ అండ్ కస్టమ్స్ ప్రయోజనాల కోసం టమోటాలను కూరగాయలుగా పరిగణించాలని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.


టమోటాలు ఆరోగ్య ప్రయోజనాలు:



  • టమోటాలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్ చాలా టమోటా రకాలకు వాటి రిచ్ రెడ్ కలర్ ను ఇస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • టమోటాలు ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ లను నిరోధిస్తాయిని తెలిపారు. 2015లో 26 అధ్యయనాల తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు.

  • రోజూ 9 నుంచి 21 మిల్లీ గ్రాముల లైకోపీన్ తీసుకుంటే ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని వివరించారు.

  • టమాట్లోని లైకోపీన్ దీర్ఘకాలిక మంటను తగ్గిస్తుందని నిపుణులు తెలిపారు. అంతేకాదు టమోటాల్లో ఉండే పొటాషియం, రక్తపోటును తగ్గిస్తుంది.

  • టమోటాలో డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును నిండిన అనుభూతి కలిగించడంతోపాటు జీవక్రియను మెరుగుపరుస్తుంది.

  • మీ రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. టమోటాలో ఉండే బీటా కెరోటిన్.. శరీరంలో విటమిన్ Aగా మారుతుంది. ఆరోగ్యకరమైన పెరుగుదల, వృద్ధాప్యాన్ని ప్రోత్సహిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • ఫొలేట్, కాపర్, మాంగనీస్, ప్రొటీన్, నియాసిన్, విటమిన్ K కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ C అంటు వ్యాధులతో పోరాడేందుకు సహాయపడుతుంది. ఇమ్యూనిటిని పెంచుతుంది.

  • ఒక పెద్ద టమోటాలో 14 మిల్లీ గ్రాముల విటమిన్ C ఉంటుంది.


రోజూ టమోటాలు తినడం మంచిదేనా?


రోజూ టమోటాలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు. రోజువారీ ఆహారంలో టమోటాలు చేర్చుకుంటే ఎలర్జీ రిస్కులు తగ్గుతాయి. గుండెల్లో మంట తగ్గుతుంది. టమోటాలను రెగ్యులర్ గా తీసుకుంటే ఊపిరితిత్తులకు కూడా మేలు జరుగుతుంది. వీటిని తింటే ఆస్తమా రోగులకు మేలు జరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, అతి ఎప్పటికీ మంచిది కాదు. మేలు చేస్తుందని అదే పనిగా వాటిని ఆరగిస్తే కొత్త సమస్యలు వస్తాయి. మీరు ఏం తిన్నా సరే.. తప్పకుండా ఆహార నిపుణులు.. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించాలి.


Also Read : కసిగా 10 వేల అడుగులు టార్గెట్ పెట్టుకుని నడిచేస్తున్నారా? ఈ సమస్యలు తప్పవు, ఈ టిప్స్ పాటించండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.