స్ట్రాబెర్రీలు సూపర్ మార్కెట్లలో అన్ని సీజన్లోనూ లభిస్తాయి. ముఖ్యంగా పిల్లలు వీటిని తినేందుకు ఇష్టపడతారు. నిజానికి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ పండ్లను తింటూ ఉండాలి. రోజుకు రెండు స్ట్రాబెర్రీ పండ్లు తింటే చాలు, శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు జరుగుతాయి. స్ట్రాబెర్రీలలో నీటి శాతం అధికం. వీటిని తినడం వల్ల శరీరం తేమవంతంగా ఉంటుంది. ఇతర పండ్లతో పోలిస్తే దీనిలో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తిన్నాక రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరుగుతాయన్న భయం అవసరం లేదు. కాబట్టి మధుమేహ రోగులు కూడా స్ట్రాబెర్రీలను పుష్కలంగా తినవచ్చు. అలాగే మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ కె... ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యవసరమైనవి. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు స్ట్రాబెర్రీలను రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. వీటిని రోజూ తినడం వల్ల గుండె సమస్యలు, జీవక్రియ సమస్యలు, ఏకాగ్రత లోపాలు వంటివి రాకుండా ఉంటాయి. ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని నిరూపించాయి.
స్ట్రాబెర్రీలలో బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి మన రోజువారీ విటమిన్ సి అవసరాన్ని వందశాతం తీరుస్తాయి. ఈ పండ్లలో ఫోలేట్, పొటాషియం, ఫైబర్, పాలిఫెనాల్స్ వంటి గుండెకు అత్యవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గుండెపోటు రాకుండా రక్షణగా నిలుస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అయిన LDLను తగ్గించడం ద్వారా హృదయ సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది స్ట్రాబెర్రీ. అలాగే రక్తపోటును అదుపులో ఉంచడం ద్వారా హృదయ సంబంధ వ్యాధులను నిరోధిస్తుంది. స్ట్రాబెర్రీలను వినియోగించడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని నిరూపించాయి.
స్ట్రాబెర్రీలు అధికంగా తినడం వల్ల అల్జీమర్స్, మతిమరుపు వంటివి రాకుండా ఉంటాయి. దీని వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. దీనిలో ఉండే పొటాషియం గుండెకు అత్యవసరమైనది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉండేలా చేస్తుంది. స్ట్రాబెర్రీలు తినడం వల్ల చర్మం సమస్యలు రాకుండా ఉంటాయి. తలనొప్పి, అలెర్జీ, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలు రావు. స్ట్రాబెర్రీలు తినడం వల్ల కంటి శుక్లాలు వంటివి కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. స్ట్రాబెర్రీలు నోటి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. నోటి దుర్వాసనను నివారిస్తాయి. దంతసమస్యలు నిరోధిస్తాయి. పొట్టలోని అల్సర్లు రాకుండా అడ్డుకోవడంలో కూడా స్ట్రాబెర్రీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
Also read: డయాబెటిస్‌కు, గుండె వ్యాధులకు మధ్య సంబంధం ఏమిటి?
Also read: వర్క్ ఫ్రం హోం మీకు ఎంత హాని చేస్తుందో తెలుసా? దీనివల్ల ఆరోగ్యపరంగా అంతా చెడే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.