కొన్ని ఆహార పదార్థాలు విడివిడిగా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. కానీ కొన్ని రకాల ఆహారాలను కలిపి వండడం లేదా ఒకేసారి తినడం చేయడం వల్ల ఆరోగ్యం చిక్కుల్లో పడుతుంది. కొందరిలో వెంటనే ప్రభావం కనిపిస్తుంది. కడుపునొప్పి, ఉబ్బరం, విరేచనాలు అవ్వడం, కళ్లు తిరిగినట్టు అవ్వడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి దీర్ఘకాలికంగానూ ప్రభావం చూపించవచ్చు. 


తేనె - నెయ్యి
తేనె తిన్న వెంటనే నెయ్యి తినడం లేదా నెయ్యితో వండిన వంటకాలకు జతగా తేనె తినడం వంటివి చేయద్దు. ఈ రెండు ఒకేసారి పొట్టలో చేరకూడదు. ఆయుర్వేదం కూడా ఈ విషయాన్ని సమర్థిస్తోంది. ఈ రెండూ కలిపి పొట్టలో చేరితే అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. 


పాలు - పుచ్చకాయ
ఈ రెండు వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటాయి. పుచ్చకాయ సిట్రస్ కాగా, పాలు కాస్త స్వీట్ రుచిని కలిగి ఉంటుంది. ఈ రెండూ ఏక కాలంలో పొట్టలో చేరడం వల్ల కొందరిలో అజీర్తి సమస్యలు మొదలవ్వచ్చు. 


చికెన్ - బంగాళాదుంప
చికెన్ వండినప్పుడు ఇంట్లో బంగాళాదుంప వండరని లేదు. బిర్యానీలో వేయచ్చు, పిల్లల కోసం వండొచ్చు. అలాంటి సమయంలో చికెన్ తిన్న వారు బంగాళాదుంప తినకూడదు. చికెన్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. ఈ రెండింటిని ఒకేసారి తినడం వల్ల గ్యాస్ అధికంగా ఏర్పడే అవకాశం ఉంది. 


చికెన్ - పండ్లు
చికెన్ తో భోజనం ముగించాక పండ్లు తినకూడదు. కనీసం రెండు గంటలు గ్యాప్ ఇచ్చాక అప్పుడు తినాలి. ఈ రెండూ కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఇది జీర్ణ వ్యవస్థను వీక్‌గా మారుస్తుంది. ఈ రెండూ ఒకదాని తరువాత ఒకటి వెంటనే తినడం మానివేయాలి.


తేనె - ముల్లంగి దుంప
ఈ రెండూ కలిపి వండకపోవచ్చు, కానీ తేనె పూసిన ఆహారాన్ని తిన్నాక, ముల్లంగి కూరో, వేపుడో భోజనంతో పాటూ తినాల్సి రావచ్చు. అలాంటి సమయంలో గ్యాప్ తీసుకుని తింటతే మంచిది. ఈ రెండూ ఒకేసారి పొట్టలో చేరితే ప్రమాదకరమైన టాక్సిన్లు ఏర్పడతాయి. 


ఆలివ్ ఆయిల్ - నట్స్
ఆలివ్ ఆయిల్ వండిన సలాడ్లు, వంటలు తిన్నాక బాదం,జీడిపప్పులు, పిస్తాలు వంటివి తినకూడదు. ఆలివ్ ఆయిల్‌లో కొవ్వులు, నట్స్‌లోని ప్రొటీన్ కలవకూడదు. అరుగుదల సమస్యలు వస్తాయి. 


చేపలు - పాలు
పాలు వేడి చేస్తాయి, చేపలు చలువ చేస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరంలో రసాయనాల్లోనూ అనేక తేడాలు వస్తాయి. కాబట్టి చేపల కూరతో భోజనం చేశాక, టీ, కాఫీ తాగడం వంటివి చేయకూడదు. 
 


Also read: అందంగా ఉండడమే ఆ గ్రామానికి శాపమా? వద్దన్నా వస్తున్న పర్యాటకులు


Also read: మధుమేహులు ఇంట్లో ఏ వంట నూనె వాడితే బెటర్?