వానపడిందంటే చాలు చెట్టు కిందకి పరుగులు తీస్తాము, తడవకుండా తప్పించుకోవచ్చని. కానీ ఒక్కోసారి ఆ చెట్టే ప్రమాదాలకు కారణం అవుతుంది. కేవలం వాన పడినప్పుడే కాదు, సాధారణ సమయంలో కూడా కొన్ని చెట్ల కిందకి వెళ్లకూడదు. ఆ చెట్టు చుట్టు కొన్ని రకాల పరిస్థితులు కనిపిస్తే జాగ్రత్త పడాలి. ఆ చెట్టు ఏ క్షణమైన కూలిపోవచ్చని అర్థం. 


మనలాగే చెట్లు కూడా...
మనకి ఒక జీవిత కాలం ఉన్నట్టే, చెట్లకు జీవిత కాలం ఉంటాయి. ఆ సమయానికి అవి కూలిపోతాయి. అలాగే మనం జబ్బుల బారిన పడుతున్నట్టే చెట్లు కూడా పడతాయి. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. యూనివర్శిటీ ఆఫ్ అర్కాన్సాస్ (UA) సిస్టమ్స్ డివిజన్ ఆఫ్ అగ్రికల్చర్ (DOA) ప్రకారం, ఇతర జీవుల మాదిరిగానే, చెట్లకు వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.వ్యాధులు చెట్టులోని ఆకులు, కాండం, వేళ్లను ప్రభావితం చేస్తాయి. కొన్ని రకాల వ్యాధులు ఆకులపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ సమయంలో ఆకులు రాలిపోతాయి. కానీ కాండం, వేళ్లు మాత్రం శక్తిమంతంగానే ఉంటాయి. కానీ కొన్ని రకాల వ్యాధులు వేళ్లను దెబ్బతిస్తాయి. అవి చెట్టు ప్రాణాన్ని తీసేస్తాయి. విభిన్న పర్యావరణ కారకాలు కూడా చెట్టుపై ఒత్తిడి కలిగించి వాటిని త్వరగానే కూలిపోయేలా చేస్తాయి. అయితే కొన్ని రకాల లక్షణాల ద్వారా చెట్టు పరిస్థితిని అంచనా వేయచ్చు. 


పుట్టగొడుగులు..
 చెట్టు ఆకులు పచ్చగా, నిండుగా కనిపిస్తున్నప్పటికీ చెట్టు చుట్టూ పుట్టగొడుగులు కనిపిస్తే మాత్రం డేంజర్. చెట్టు ఏ క్షణంలోనైనా సూచించే ప్రధాన హెచ్చరిక అనుకోవచ్చు దీన్ని. పుట్టగొడుగులు ఒకరకమైన శిలీంధ్రాలు. ఇవి చెట్టు కింద పెరుగుతున్నాయి అంటే ఆ చెట్టు క్షీణించడం మొదలైందని అర్థం. చెట్లలోని చెక్కను తినేస్తూ పుట్టగొడుగులు ఎదుగుతాయి. మీరు చాలా చోట్ల చూసుంటారు విరిగిపోయిన చెట్లపై, చెక్కలపై పుట్టగొడుగులు పెరుగుతుంటాయి. చెట్టుపై పుట్టగొడుగులు పెరుగుతున్నాయి అంటే దానికి మరణశిక్ష వేసినట్టే. చెట్టు పునాది అయిన వేళ్లను నాశనం చేస్తాయి. అవసరమైన పోషకాలను ఇవి తినేస్తాయి. చెట్టును బలహీనపరుస్తాయి. చివరికి చెట్టుకూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే చెట్టు చుట్టూ పుట్టగొడుగులు కనిపిస్తే  దాని కింద ఉండొద్దు. ఫంగస్ చెట్టులో చేరి పెరిగి పుట్టగొడుగులుగా మారి చెట్టును కూల్చడానికి మూడు నుంచి అయిదేళ్లు పడుతుంది అని చెబుతున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. 


ఎక్కువ కాలం బతుకుతాయి...
 చాలా చెట్లు అధిక కాలం జీవిస్తాయి. కాలిఫోర్నియా విశ్వ విద్యాలయ పరిశోధకులు చెబుతున్న ప్రకారం చెట్టు జాతులను బట్టి ఒక చెట్టు 100 నుంచి వేయి సంవత్సరాల వరకు జీవిస్తుంది. అమెరికాలోని బ్రిస్టల్ కోన్ పైన్ అనే చెట్టు అయితే ఏకంగా అయిదు వేల ఏళ్ల సంవత్సరాలు జీవిస్తుంది.


Also read: స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ మంకీపాక్స్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారు?


Also read: ఈ లక్షణాలు మీలో కనిపిస్తే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం, ఏం తినాలంటే





































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.