'ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో లాయర్'త్వరలో కోర్టు కేసును తీసుకుని వాదించబోతోంది.ఈ రోబోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ లీగల్ అసిస్టెంట్‌గా మారింది. ఈ AI రోబోట్‌ను 'DoNotPay' అనే స్టార్టప్ రూపొందించింది. ఈ స్టార్టప్ ఒక న్యాయసేవలను అందించే చాట్ బోట్. 2015లో దీన్ని స్థాపించారు. ఈ చాట్ బోట్ స్మార్మ్ ఫోన్లో రన్ అవుతుంది. కోర్డు వాదనలను యాప్ ద్వారానే వింటుంది.  మానవ న్యాయవాదిలాగే ఇది ప్రతివాదికి సమాధానం చెబుతుంది. ఈ రోబోట్ తొలికేసు వాదించబోయేది బ్రిటన్ కోర్టులో.


తొలిసారి కోర్టులో నిజమైన కేసును వాదించబోతోంది ఈ రోబోట్.  వేగంగా డ్రైవ్ చేసినందుకు ఒక వ్యక్తి చట్టపరమైన సమన్లు (బ్రిటన్లో స్పీడింగ్ టిక్కెట్ అంటారు) అందుకున్నాడు. దానికి సంబంధించి ఆయన సాయం చేయాల్సిందిగా చాట్ బోట్‌లో సంప్రదించాడు. ఆలస్యరుసుములు, జరిమానాలకు సంబంధించిన సలహాలు చాట్ బోట్‌లో అందిస్తుంది.ఇప్పుడు వ్యక్తి అందుకున్న స్పీడింగ్ టిక్కెట్ గురించి కోర్దులో వాదించ నుంది. వచ్చే నెల ఫిబ్రవరిలో ఈ కేసు విచారణకు రానుంది. న్యూ సైంటిస్ట్ నివేదించిన ప్రకారం, AI రోబోట్ కోర్టులో విన్న సమాచారాన్ని ప్రాసెస్ చేసి, విశ్లేషిస్తుంది.ప్రతివాది ప్రతిస్పందించడానికి సలహా ఇస్తుంది. ఒక వేళ ఈ కేసులో ఓడిపోతే క్లయింట్ దగ్గర తీసుకున్న డబ్బును తిరిగి సంస్థ ఇచ్చేస్తుంది. 


DoNotPay సంస్థ కృత్రిమ మేధస్సును ఉపయోగించి ప్రజలకు పార్కింగ్ టిక్కెట్ల గొడవలు, బ్యాంకు రుసుములను అప్పీల్ చేయడం,దావా వేయడం వంటి వారి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడేలా AI రోబోట్ తయారుచేసింది. అంతేకాదు చట్టపరమైన సమాచారాన్ని సులువుగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో తేవడం కూడా ఈ సంస్థ ఉద్దేశం. 


AI రోబోట్ ఎందుకు? 
UKలో,స్పీడింగ్ టిక్కెట్లు అధికంగా డ్లైవర్లు పొందుతారు. ఈ కేసులను వాదించడానికి న్యాయవాదిని నియమించుకోవడం చాలా ఖరీదైన వ్యవహారం. కేసుకు సంబంధించిన అంశాలను బట్టి 200 పౌండ్ల నుంచి 1000 పౌండ్ల వరకు ఖర్చు అవుతుంది. AI రోబోట్ చాలా తక్కువ ఖర్చుతో ఈ కేసులను వాదించేలా రూపొందించారు. బ్రిటన్ చట్ట నియమాలన్నీ ఈ రోబోట్ లో ఫీడ్ చేశారు. దాన్ని బట్టి ఈ రోబోట్ ప్రతిస్పందింస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో చాలా రంగాల్లో అడుగు పెట్టే అవకాశం ఉంది.






Also read: పొట్టకు కుడివైపున వచ్చే నొప్పిని తేలిగ్గా తీసుకోకండి - ఇవి భయంకర రోగాలకు సంకేతం కావచ్చు