సినిమాల్లోనే హంతకులను చూసి కొంతమందికి వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది నిజమైన హంతకుడి పక్కన కూర్చోవాలంటే... ఆ ఊహే చాలా భయానకంగా ఉంటుంది. అలాంటి స్థితి ఓ మహిళకు వచ్చింది. అనుకోకుండా ఫ్టైట్లో ఆమె సీటు 20 మందిని చంపిన ఒక నరరూప రాక్షసుడి పక్కన వచ్చింది. దీంతో ఆమె అతడి నుంచి దూరంగా జరిగి, అదో రకంగా చూసింది. ఆ సమయంలో ఫ్టైట్ లో ఉన్న ఒక వ్యక్తి కెమెరాకు పనిచెప్పాడు. దీంతో ఆ ఫోటో వైరల్‌గా మారింది. ఆ సీరియల్ కిల్లర్ ఎవరో కాదు చార్లెస్ శోభరాజ్.
నెట్ ఫ్టిక్స్ క్రైమ్ డాక్యుమెంటరీ ‘ది సర్పెంట్’చాలా మంది చూసి ఉంటారు. చార్లోస్ శోభరాజ్ జీవిత కథ ఆధారంగానే దీన్ని తెరకెక్కించారు. 1970లలో ఆసియాలో వరుస హత్యలకు పాల్పడిన వ్యక్తి శోభరాజ్. అతను ఎన్నో ఏళ్ల పాటూ నేపాల్ జైలులోనే మగ్గుతూ వచ్చాడు. ముసలివాడైపోయిన అతడిని ఇంకా జైల్లో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని భావించి నేపాల్ కోర్టు అతడిని విడుదల చేయమని తీర్పు ఇచ్చింది.
చార్లెస్‌ది ఫ్రాన్స్. అతను నేపాల్ నుంచి ఫ్రాన్స్ వెళ్లేందుకు బయల్దేరాడు. ఇందులో భాగంగా ఖతార్ ఎయిర్ వేస్ విమానంలో దోహా మీదుగా ఫ్రాన్స్‌కు వెళ్లాడు. ఖతార్ ఎయిర్ వేస్లో విమానంలో శోభరాజ్ కూర్చుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని కన్నా, అతని పక్కన కూర్చున్న ఓ మహిళ చాలా హైలైట్ అయింది. సీరియల్ కిల్లర్ పక్కన కూర్చోవాలా? అన్న ఎక్స్ ప్రెషన్ ఆమె ముఖంలో కనిపించింది. భయం, అనుమానం, ఏం చేయాలో తెలియని తనం అన్నీ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించాయి. నిజమే మరి 20 మందిని చంపి, ఏళ్లకు ఏళ్లు జైల్లో గడిపి వచ్చిన వ్యక్తి పక్కన కూర్చోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఆమె ఫోటోకు నెటిజన్లు రకరకాల కామెంట్లు పెట్టారు.
Also read: ప్రపంచదేశాల్లోని ఉత్తమ వంటకాల జాబితాలో మనదేశానిది ఐదో స్థానం - టాప్ వన్‌లో ఉన్న ఆహారం ఏదంటే..