వాలెంటైన్స్ వీక్‌లో చాక్లెట్‌ డేకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ వారంలో మూడవ రోజున చాక్లెట్ డే జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన వస్తుంది. ఈ రోజున, ప్రేమికులు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. కొత్త కొత్త మార్గాలలో లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. మీరు చేసే ప్రపోజల్ ఎంత అందంగా ఉంటే, మీ లవర్ మనసును అంత ఎక్కువగా గెలుచుకునే అవకాశం ఉంటుంది. అందరికీ ప్రేమ కావాలి. ఈ ప్రేమను స్వీకరించడానికి మీరు చేయవలసిన మొదటి పని దానిని వ్యక్తపరచడం.


మార్కెట్లో తినడానికి  చాలా వస్తువులు ఉన్నా.. చాక్లెట్లు మాత్రం స్పెషల్. కాబట్టి, ప్రతి ఒక్కరి మొదటి ప్రాధాన్యత చాక్లెట్. మీరు ఎవరితోనైనా సన్నిహితంగా ఉండాలనుకుంటే.. అలాగే వారికి మీ ప్రేమను చూపించాలనుకుంటే.. ఇంకెందుకు ఆలస్యం.. మీ ప్రేమను కొత్త రకంగా తెలియజేయాలంటే చాక్లెట్లను గిఫ్ట్ గా ఇవ్వండి. ఇక ప్రేమికుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వారి ప్రేమ ప్రయాణంలో చాక్లెట్ తప్పనిసరిగా ఉంటాయి. వాలెంటైన్స్  వీక్ లో లవర్స్‌కు చాక్లెట్లు ఎందుకు ఇస్తారో ఇక్కడ  తెలుసుకుందాం.


ప్రేమగా పలకరింపు 


తన ప్రేయసిని కలిసేటప్పుడు ప్రియుడు తన కోసం ప్రేమగా ఒక చక్కని చాక్లెట్‌ని తీసుకుని వెళ్తాడు. దానిని చూసిన ప్రియురాలి సంతోషానికి అవధులు ఉండవు. ఇది చూడటానికి చిన్నగానే కనిపిస్తుంది. కానీ ప్రేమికులకు పెద్ద ట్రీట్ లా అనిపిస్తుంది. మార్కెట్లో  చాలా స్వీట్లు ఉన్నా..  కానీ చాక్లెట్‌కు ఉన్న క్రేజే వేరు.


అందరికీ అందుబాటులో..


మీ ప్రియమైన వారికి చాక్లెట్లు బహుమతిగా ఇవ్వడానికి మరొక ముఖ్యమైన కారణం ఏమిటంటే.. అవి అందరికీ అందుబాటులో ఉంటాయి. అలాగే ఏ బడ్జెట్‌లో కావాలన్నా దొరికేస్తాయి. దానిని తీసుకెళ్లడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ప్యాకింగ్‌తో కూడా పని లేదు. దీన్ని ఎలాగైనా ఇవ్వొచ్చు. 


రుచి సాటిలేనిది..


నోటిలో వేసుకోగానే కరిగిపోయే ఈ చాక్లెట్ల రుచిని ఎవరు ఇష్టపడకుండా ఉంటారు? అందుకే ఈ చాక్లెట్లు తియ్యని వేడుకకి ఉపయోగపడతాయి. అందువల్ల, అవి సాధారణంగా ప్రేమకు చిహ్నంగా ఇవ్వబడతాయి. పైగా చాక్లెట్లు ఆరోగ్యానికి కూడా మంచివే. గుండెకు మేలు చేస్తాయి. 


మీ లవర్ అలక తీర్చేందుకు..


గొడవ పడినప్పుడు వారిని కూల్ చేయడానికి ఇంతకంటే మంచి ఆప్షన్ ఉంటుందా చెప్పండి. కాబట్టి వారికి ఇష్టమైన చాక్లెట్ ఇవ్వండి. వెంటనే, అలక మాయమై. బేబీ, నువ్వు కూడా తినూ అంటూ..  మీకు కూడా ఒక చిన్న బైట్ ఇస్తుంది. 


మూడ్ మారిపోవడం 


చాక్లెట్ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. హ్యాపీ హార్మోన్స్‌ను ప్రేరేపించడంలో చాక్లెట్ కీలకంగా పనిచేస్తుంది. బాధను దూరం చేస్తుంది. సంతోషాన్ని ఇస్తుంది. అందుకే చాలా మంది వీటిని తిన్నాక ఫ్రీగా ఫీల్ అవుతుంటారు. డార్క్ చాక్లెట్‌లో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు,  ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే చర్మ పరిస్థితి మెరుగవుతుంది.


Also Read : HPV వ్యాక్సిన్ కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిల్లో ఆ క్యాన్సర్ రాకుండా దీనిని తీసుకోవాలట


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.