ఫ్రాన్స్‌లో పిల్లలు వైన్ తాగుతారట. ఔనండి, నిజమే. ఇప్పటికీ ఫ్రెంచ్ కుటుంబాలు ఫ్యామిలీ ఫంక్షన్లలో పిల్లలకు మద్యం తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఇదేం చోద్యం అనుకుంటున్నారా? అయితే మీరు ఫ్రెంచ్ కల్చర్‌కు.. వైన్, ఆల్కహాల్‌కు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం.
పారీస్‌లో 1956 వరకు మధ్యాహ్న భోజనంలో వాటర్ కట్ వైన్ తాగేందుకు స్కూళ్లలో కూడా అనుమతి ఉండేది. కానీ అప్పట్లో పాఠాశాలల్లో వైన్ నిషేధించాలని వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం చాలా మంది తల్లిదండ్రులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పట్లో వైన్ పిల్లల ఎదుగుదలకు మంచిదని, వారిని బలంగా తయారు చేస్తుందని నమ్మకం ఉండేది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది పేరెంట్స్ వ్యతిరేకించాలని అనుకున్నారు కూడా. 1979లో స్కూల్ క్యాంటీన్ లో 14 ఏళ్ల లోపు వాళ్లకు మద్యం సర్వ్ చెయ్యటం నిషేధించారు. అయితే ఈ చట్టాలు కేవలం స్కూల్ లో వైన్ సర్వ్ చెయ్యటం గురించి మాత్రమే. ఫ్రాన్స్ లో ఇప్పటి వరకు 18 ఏళ్లలోపు వారు మద్యం తీసుకోకూడదనే నిర్దిష్ట చట్టం లేదు. అయితే మైనర్లు మద్యం కొనడం, మైనర్లకు మద్యం అమ్మడం నిషేదం.
18 సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలు వారి తల్లిదండ్రులు లేదా గార్డియన్ల సంరక్షణలో ఉంటారు. తల్లిదండ్రులకు వారి పిల్లలకు మద్యం అందుబాటులో ఉంచాలో వద్దో నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. కానీ వారు పిల్లలకు మద్యం తీసుకునే అనుమతి ఇస్తే పిల్లల సంరక్షణ హక్కు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఫ్రెంచ్ పిల్లలు ప్రతి రోజు వైన్ తాగుతారని కాదు.. కానీ ఫ్రెంచ్ కుటుంబాల్లో మద్యపానం ఎదుగుదలలో భాగం అని ఇప్పటికీ నమ్ముతారు. చాలా అరుదుగా గెట్ టుగెదర్స్, చిన్నచిన్న ఫ్యామిలీ పార్టీలలో పిల్లలకు వైన్‌ను అనుమతిస్తారు.
ఇప్పుడు కొత్త అధ్యయనాలు ఇలా చిన్నతనంలోనే వైన్ తాగడం తెలిసిన పిల్లలు భవిష్యత్తులో ఆల్కాహాలిక్స్ గా మారే ప్రమాదం ఉంటుందని చెబుతున్నాయి. అంతేకాదు ఆల్కాహాలిక్ లలో సాధారణంగా కలిగే కాలేయ, గుండె సంబంధ జబ్బులు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఫ్రాన్స్, మరికొన్ని యూరోపియన్ దేశాల్లో తల్లిదండ్రులు తమ అడాలసెంట్ పిల్లలను వైన్ తాగేందుకు అనుమతిని ఇస్తున్నారు. ఇది భవిష్యత్తులో వారికి మద్యం వాడకంలో బాధ్యత నేర్పుతుందని కొంత మంది ప్రోత్సహిస్తున్నారట.
కానీ అడాలసెంట్ వయసులో మద్యం తీసుకోవడం రకరకాల ఆరోగ్య, సామాజిక సమస్యలకు కారణం కావచ్చు. యూకేలో ప్రతి ఏడుగురు ఆల్కహాలిక్స్‌లో ఒకరు 11 సంవత్సరాలకు ముందు నుంచే మద్యం తీసుకోవడం మొదలు పెట్టిన వారే కావడం గమనార్హం. డ్రింకావేర్ అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన సర్వేలో 15 సంవత్సరాల వయసులో 70 శాతం మంది మద్యం తీసుకోవాలని ప్రయత్నించారట. ఆర్కైవ్స్ ఆఫ్ డిసీజ్ ఇన్ చైల్డ్ హుడ్ అనే జర్నల్ లో ఫ్రెంచ్ ఫ్యామిలి డ్రింకింగ్ అపోహను ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారని ఒక ఆర్టికల్ లో ప్రచురించారు.
Also Read: మీరు తందూరి చికెన్ ప్రియులా? జాగ్రత్త దాని వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువేనట
చిన్నతనంలోనే కొద్ది పాటి వైన్ తాగడం పిల్లలకు నేర్పిస్తే.. భవిష్యత్తులో వారికి దాన్ని ఎంత మేరకు వాడవచ్చు అనే అవగాహన కలుగుతుందనేది ప్రెంచ్ ఫ్యామిలీ అపోహ అని చెప్తారు. ఆల్కాహాలిక్ మరణాలు పారీస్‌లోనే ఎక్కువ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు కూడా చెబుతున్నాయి. అందుకే పిల్లలకు ఆల్కాహాల్ ఇవ్వడానికి ముందు తల్లిదండ్రులకు దాని ప్రభావం భవిష్యత్తులో పిల్లల మీద ఏ మేరకు ఉంటుందో అవగాహన కలిగించడం అవసరమని యూకే ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు. కనీసం 15 సంవత్సరాల వయసు వచ్చే వరకైనా వారికి మద్యాన్ని అనుమతించకూడదని N.H.S గైడ్ లైన్స్ సూచిస్తున్నాయి. 15 నుంచి 17 సంవత్సరాల లోపు వారు వారానికి ఒక్కసారికి మించకుండా మద్యం తీసుకునేలా పరిమితులు విధించాలని కూడా సూచిస్తున్నారు. అది కూడా తప్పని సరిగా పేరెంట్స్ లేదా గార్డియన్ల సమక్షంలో మాత్రమే అని చెబుతున్నారు.