గ్రిల్ పై కాల్చి తయారు చేసే.. తందూరి చికెన్ అంటే అందరికీ నోరూరుపోతుంది. తందూరి రుచి మరి ఇంకదేనికి రాదనే చెప్పాలి. అయితే ఇలా నిప్పుల మీద కాల్చి చేసే తందూరి చికెన్ లేదా మాంసం తినడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడిస్తుంది. తందూరి చికెన్ ని బార్బేక్యూ అనే మెథడ్ లో వండుతారు. కూరగాయల నూనెని వేడి చేసినప్పుడు అందులో వచ్చే ప్రమాదకరమైన సమ్మేళనాలని బార్బేక్యూ పరిమితం చేస్తుంది. అయితే నేరుగా మంటపై చేసే ఆహార పదార్థాలు, ప్రత్యేకించి మాంసాహారం వల్ల క్యాన్సర్ కి కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


తందూరి వంట పద్ధతి క్యాన్సర్ కి ఎలా కారణం అవుతుంది?


మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల దాని పై పొరపై క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కండలు పెరిగేందుకు దోహద పడే ఆర్గానిక్ యాసిడ్ అధిక మంట మీద వేడి చేసినప్పుడు క్యాన్సర్ కి కారణమయ్యే హెటెరోసైక్లిక్ అమైన్‌లుగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే అవి కాలుతున్నప్పుడు వాటి కొవ్వు నిప్పు మీద పడుతుంది. ఇది పాలీ సైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్ లకి దారితీస్తుంది. ఇది తీసుకుంటే మానవులకి చాలా ప్రమాదకరం.


కాల్చిన మాంసాన్ని తినడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మిన్నేసోటా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం బాగా స్టీక్ చేసిన ఆహారం తినని వారితో స్టీక్ చేసిన ఆహారం తినే వాళ్ళని పలిస్తే 60 శాతం మందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. మయి క్లినిక్ ప్రకారం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ దాని ప్రారంభ దశల్లో గుర్తించడం చాలా కష్టం. అది ఇతర అవయవాలకి వ్యాపించి ప్రాణాంతక దశకు చేరుకున్న తర్వాత దీని లక్షణాలు తరచుగా బయటపడతాయి. అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన డేటా ప్రకారం 2019 వరకు USలో 89,248 మంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అంచనా.


క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?


మీకు ఎంతో ఇష్టమైన మాంసాన్ని కాల్చి వండుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి కొంతవరకు బయటపడొచ్చు. వంట చెయ్యడానికి ముందు ఎప్పుడు దాన్ని మెరినేట్ చెయ్యాలి. మాంసాన్ని తందూరి లేదా బార్బేక్యూ పద్ధతిలో వండటానికి ముందు కనీసం కనీసం 30 నిమిషాల పాటు మెరినేట్ చేయాలని సిపార్సు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మాంసం మరింత రుచిగా మారాడమే కాకుండా కాల్చేటప్పుడు బాగుంటుంది.


కూరగాయలు, పండ్లని బఫర్ గా ఉపయోగించడం


కొన్ని కూరగాయలు, పండ్లను బఫర్ గా ఉపయోగించినప్పుడు అవి అద్భుతమైన రుచిని ఇస్తాయి. రుచి ఇవ్వడంతో పాటు మసాలాగా కూడా పని చేస్తాయి. బెల్ పెప్పర్స్, పైనాపిల్, ఉల్లిపాయలు తందూర్ లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయలు, పండ్లు


గ్రిల్ శుభ్రం చెయ్యాలి


వంట చేసే ముందు గ్రిల్ ని శుభ్రంగా చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మునుపటి వంట నుంచి మిగిలిపోయిన మాడిపోయిన పదార్థాలలో క్యాన్సర్ తాలూకు కారకాలు ఉండే అవకాశం ఉంది. కాల్చిన ఆహారాన్ని సరిగా కడిగిన తర్వాత దాన్ని కొద్దిగా నూనె రాసుకోవడం ఉత్తమం. దాన్ని వండేటప్పుడు తరచూ తిప్పుతూ ఉండటం ముఖ్యం. అప్పుడే అది అన్ని వైపులా సక్రమంగా ఉడుకుంటుంది. మాంసం మీద సన్నగా, క్లీనర్ కట్ లు ఇవ్వాలి. ఇవి వంట సమయం తగ్గేలా చేస్తుంది. అలాగే కొవ్వు తక్కువగా నిప్పుల మీద పడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: కొత్తిమీరతో థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చా?