రోజుల్లో చాలా రకాల క్యాన్సర్లు ప్రజలను భయపెడుతున్నాయి. అయితే వీటిలో చాలావరకు క్యాన్సర్లను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమై నార్మల్ లైఫ్ గడిపెయ్యవచ్చు. అటువంటి క్యాన్సర్లలో ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్. దీన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత బాగా ట్రీట్ చెయ్యడం సాధ్యం అవుతుంది. అలా గుర్తించాలంటే ముందు మనకు బ్రెస్ట్ క్యాన్సర్, దాని లక్షణాలకు సంబంధించిన అవగాహన ఉండాలి. అవేంటో చూసేయండి మరి. 


⦿ చాలా సార్లు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడంలో విఫలం అవుతుంటారు అనే కంటే నిర్లక్ష్యంగా ఉంటారు అనేది నిజం. అలా నిర్లక్ష్యం చేసే లక్షణాల్లో ఒకటి ఆర్మ్ పిట్స్. అంటే బాహుమూలల్లో ఏర్పడిన మార్పులను గుర్తించడం. అలాగే అసలు ఏమాత్రం పట్టించుకోని మరో లక్షణం కాలర్ బోన్ లో కనిపించే మార్పులు కూడా.


⦿ బ్రెస్ట్ క్యాన్సర్ ఇండియాలోని పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్. ఇది స్త్రీ పురుషులిద్దరిలోనూ కనిపిస్తుంది. కానీ స్త్రీలలో కాస్త ఎక్కువ. లక్షణాలు త్వరగా గుర్తించడం అనేది ఈ క్యాన్సర్ చికిత్సలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా రొమ్ములో వచ్చే మార్పులను వీలైనంత త్వరగా గుర్తించగలగాలి. అంటే రెగ్యులర్ గా రొమ్ముల పరిమాణం, ఆకారం వంటి వాటిని పరిశీలించుకుంటూ ఉండాలి. చాలా మంది ఈ విషయాలను గమనించుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటారు.


⦿ చాలా సందర్భాల్లో బాహుమూలలు అంటే ఆర్మ్ పిట్స్ లో కనిపించే లక్షణాలను పట్టించుకోరు. అంతేకాదు కాలర్ బోన్ లో వచ్చే మార్పులను కూడా పెద్దగా గమనించరు. బ్రెస్ట్ క్యాన్సర్ లో రొమ్ములో ఏర్పడిన క్యాన్సర్ కణితి తోక లాగ బాహు మూలల్లోకి విస్తరించవచ్చు. 


⦿ కాలర్ బోన్ కింద రొమ్ముకు సంబంధించిన కణజాలాలు, వినాళ గ్రంథులు కాలర్ బోన్ కింద ఉంటాయి. కనుక కాలర్ బోన్ లో వచ్చే మార్పు ఎటువంటిదైనా సరే నిర్లక్ష్యం పనికి రాదనేది నిపుణుల సలహా.


⦿ తర్వాత పరీక్షించుకోవాల్సిన ముఖ్య అవయవం. చనుమొనలు అంటే బ్రెస్ట్ నిపిల్స్. నిపిల్స్ ఎర్రబారినా లేక వాపు కనిపించినా నిర్లక్ష్యం పనికి రాదు. లోపలికి ముడుచుకు పోయినా, పెద్దగా పట్టించుకునే అవసరం లేనంత తక్కువ స్థాయిలో నిపుల్స్  నుంచి డిశ్చార్జ్ కనిపించినా సరే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం.


⦿ క్రమం తప్పకుండా రొమ్ములను స్వీయ పరీక్ష చేసుకోవడం చాలా అవసరం. చేతితో తాకి నపుడు చిన్నగా అయినా సరే గట్టిగా లేదా మెత్తగా ఎలాంటి లంప్ చేతికి తగిలినా నిర్లక్ష్యం వద్దు. చాలా సార్లు ఇలా ఏర్పడిన సిస్ట్ లు చేతితో జరిపితే జరిగినట్టుగా అనిపిస్తాయి. నొప్పి లేకుండా ఉంటాయి.  


⦿ ఇలా కనిపించే అన్ని లంప్స్ క్యాన్సర్ కాకపోవచ్చు. కానీ నిర్లక్ష్యం మాత్రం కూడదనేది నిపుణుల వాదన.  ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకొని లక్షణాలు దేని వల్ల ఏర్పడిందనేది నిర్ధారించుకోవడం అత్యవసరం. చిన్న నిర్లక్ష్యం కూడా ఒక్కోసారి పెద్ద  మూల్యానికి కారణం కావచ్చు. కనుక చిన్న మార్పులను కూాడా గమనించుకోవడం అవసరం. 


Also Read: బరువు తగ్గేందుకు రోజూ ద్రాక్ష పండ్లు తీసుకున్న మహిళ - దారుణం జరిగిపోయింది!


Also Read: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే