ర్రర్ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ఈ ఇంటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. వారు ఇప్పటికే ‘ది కంజూరింగ్’ సినిమాలో ఆ ఇల్లు ఎంత భయానకంగా ఉంటుందో చూసేశారు. 2013లో విడుదలైన ‘ది కంజూరింగ్’ సినిమాకు స్ఫూర్తినిచ్చిన ఈ ఇళ్లు చాలా ఏళ్లుగా ఖాళీగా ఉంటుంది. దీన్ని కొనుగోలు చేయడానికి చాలామంది వెనకడుగు వేశారు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. ఈ ఇంటి ధర, రెండోది ఆ ఇంట్లో ప్రేతాత్మలు తిరుగుతున్నాయనే భయం. అదేంటీ, ఆత్మలు తిరుగుతున్న ఇంటిని తక్కువ రేటుకు అమ్మాలిగా, అంత ధర ఎందుకు పలుకుతోందనేగా మీ సందేహం? అదే మ్యాజిక్కు!


అమెరికాలోని రోడే ఐలాండ్‌లో గల ఈ ఫామ్‌హౌస్‌ను అంతా ‘హాంటెడ్ హౌస్’ అని అంటారు. ఆ ఇంట్లో ఎవరైతే నివసిస్తారో.. వారిని ప్రేతాత్మలు వేదిస్తాయనే నమ్మకం ప్రచారంలో ఉండటం వల్ల ఆ ఇంటికి ఆ పేరు వచ్చింది. బుర్రిల్‌విల్లేలో 18వ శతాబ్దంలో ఈ ఇంటిని నిర్మించారు. అన్నేళ్లయినా ఈ ఇల్లు చెక్కు చెదరలేదు. దీంతో ఓ మహిళ 1.525 మిలియన్ డాలర్లు (రూ.11 కోట్లు) చెల్లించి మరీ ఈ ఇంటిని తన సొంతం చేసుకుంది. పైగా, అది ‘హాంటెడ్’ హౌస్ అని తెలిసినా తనకేమీ భయం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చింది. తన విశ్వాసాలు తనకు ఉన్నాయని పేర్కొంది. 


Also Read: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!


వండర్‌గ్రూప్ LLC సంస్థ యజమాని జాక్వెలిన్ నూనెజ్ ఈ ఇంటిని కొనుగోలు చేసింది. నా వ్యక్తిగత అవసరాల కోసమే తాను ఇంటిని కొనుగోలు చేశానని, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం కాదని ఆమె స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ ‘కంజూరింగ్’ ఇల్లు కోరి, జెన్నిఫర్ హెయిన్‌జెన్ ఆధీనంలో ఉండేది. హెయినెజ్ ఇన్నాళ్లూ ఆ ఇంటిని పారానార్మల్ (అతీంద్రియ శక్తులు) వ్యాపారానికి ఈ ఇంటిని ఉపయోగించాడు. ఆత్మల ఉనికిని తెలుసుకోడానికి వచ్చే అతిథులకు ఈ ఇంటని అద్దెకు ఇచ్చేవాడు. వారు రాత్రిపూట అక్కడ పారానార్మల్ పరిశోధనలు చేసేవారు. లైవ్‌లో ప్రేతాత్మల ఉనికిని చూపించే కార్యక్రమాలకు కూడా అనుమతి ఇచ్చేవాడు. ఈ ఇంటిని కొనుగోలు చేసిన జాక్వెలిన్ కూడా అవన్నీ కొనసాగిస్తానని పేర్కొంది.






‘‘ఈ ఇంట్లో ఉన్న ప్రేతాత్మలు లేదా శక్తులు దుర్మార్గంగా ఉంటాయని నేను నమ్మను. కానీ, నన్ను ఆశ్చర్యపరిచే ఘటనలు ఇక్కడ జరుగుతాయని నాకు తెలుసు. కానీ, నాకు వాటి వల్ల ఎలాంటి హాని కలగదు. ఆ అనుభవం పొందేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’ అని తెలిపింది. 1971లో ఆ ఇంట్లో నివసించిన ఓ కుటుంబం ప్రేతాత్మల వేదింపులు ఎదుర్కొంది. రోజర్, కరోలిన్ పెర్రాన్ దంతతులు, వారి ఐదుగురు కుమార్తెలు ఆ ఫామ్ హౌస్‌లో నివసించేవారు. వారి కుక్క అనుమానస్పద స్థితిలో చనిపోయింది. అప్పటి నుంచి వారి ఇంట్లో వింత ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పారానార్మల్ నిపుణులు వచ్చి ఆ ఆత్మలను నుంచి వారికి రక్షించారు. ఈ ఇంట్లో జరిగిన ఘటనల ఆధారంగా ‘ది కంజూరింగ్’ సినిమా తెరకెక్కింది. అయితే, ఆ మూవీని మాత్రం ఈ ఇంట్లో చిత్రీకరించలేదు. అయితే, ఇప్పటికీ ఆ ఇంట్లో ఆత్మలు ఉనికిలోనే ఉన్నట్లు చెబుతుంటారు. 


Also Read: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!