Thailand offers a crazy offer to Indians : దాదాపు ఇండియాను వదిలి ఏ పొరుగు దేశానికి వెళ్లాలన్నా.. వీసా అవసరం. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే మీకు వీసా లేకపోయినా పర్లేదు.. ఈ ఆరునెలల్లోనే ఎప్పుడైనా మీరు మా దేశానికి రావొచ్చు అని పిలుస్తుంది ఓ దేశం. వీసా లేకుండా ఎందుకు ఇండియన్స్​ని రమ్మంటోంది. అలా వెళ్లొచ్చా? ఇలా వెళ్లడం వల్ల వాళ్లకేమి కలిసి వస్తుంది? ఆ దేశం పేరేమిటి? ఇంతకీ ఇది నిజమా? అబద్ధమా? అని ప్రశ్నలు మీలో మెదులుతున్నాయా? అయితే దానికి ఆన్సర్​ 100 శాతం నిజం. 


రీజన్ అదే..


థాయ్​లాండ్ దేశం.. భారతీయులు వీసా లేకుండా కూడా మా దేశానికి రావొచ్చు. వచ్చే ఆరు నెలల్లో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వీసా లేకుండా రావొచ్చు అంటూ బంపర్ ఛాన్స్ ఇచ్చేసింది. ఆ దేశంలో టూరిజం మార్కెట్​ను పెంచుకునేందుకు ఈ ఆఫర్ ఇచ్చింది. ఈ సంవత్సరం సుమారు 28 మిలియన్ల రాకపోకలను థాయ్​లాండ్ లక్ష్యంగా చేసుకుంది. దేశంలో ఆర్థిక వృద్ధిని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా థాయ్​లాండ్ ఆర్థిక వ్యవస్థ భారీగా ఎగుమతిపై ఆధారపడి ఉంది. ఏ దేశ ఆర్థిక వృద్ధిలో అయినా పర్యాటక రంగం కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఇండియన్స్​ను వీసా లేకుండా తమ దేశానికి రమ్మంటుంది పర్యాటక రంగం. 


ఆరు నెలలు..


ఇంతకీ దీనికి గడువు ఏమైనా ఉందా? మనం ఎప్పుడు వెళ్లొచ్చు? అంటే దీనికి గడువు ఉంది. మనం నవంబర్ 10 నుంచి మే 10, 2024 వరకు ఆరునెలల పాటు.. థాయ్​లాండ్​కు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు. టూరిజం సీజన్ దగ్గర్లోనే ఉంది కాబట్టి.. మీరు వెళ్లాలనుకుంటే కచ్చితంగా ఈ దేశాన్ని విజిట్ చేయవచ్చు. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించుకోవాలనే లక్ష్యంతో థాయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 


చైనీస్ కోసం కూడా..


అయితే ఆ దేశం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదేమి కొత్తకాదు. 2019లో రికార్డు స్థాయిలో ఆ దేశాన్ని 39 మిలియన్లు విజిట్ చేశారు. దానిలో 11 మిలియన్లు చైనీస్ టూరిస్ట్​లు ఉన్నారు. ప్రీ పాండమిక్​ సమయంలో టూరిజం మార్కెట్ అయిన చైనీస్​ కోసం థాయ్​లాండ్ 2023 సెప్టెంబరులో వీసాను రద్దు చేసింది. ఈ క్రమంలోనే భారతీయ పర్యాటకులకు శుభవార్త చెప్పింది.


థాయ్ మసాజ్..


మీకు కూడా టిప్స్, టూర్స్​కి ఎక్కువగా వెళ్లే పర్సన్​ అయితే.. మీ హాలీడేలో మీరు హాయిగా థాయ్​లాండ్ చెక్కేయవచ్చు. థాయ్​లాండ్​ చారిత్రక, సహజమైన, సాంస్కృతిక ప్రదేశాలకు బాగా ప్రసిద్ధి. బీచ్​లు, ద్వీపాలు సందర్శించవచ్చు. పర్వతాలలో ట్రెక్కింగ్ చేయవచ్చు. అయితే ఇక్కడ వీటకంటే మసాజ్ చాలా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా థాయ్​మసాజ్​లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు కూడా ఓ స్ట్రెస్​ఫుల్​ లైఫ్​లో ఉంటే.. దాని నుంచి కాస్త విశ్రాంతి కోరుకుంటే మీరు థాయ్​లాండ్​ వెళ్లొచ్చు. అంతేకాదు వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్​ ప్రకారం థాయ్​లాండ్ ఐదవ అతిపెద్ద మెడికల్ టూరిజం. ఇక్కడ కాస్మోటిక్ సర్జరీలకోసం ఎక్కువ మంది వస్తుంటారు. ముఖ్యంగా సెక్స్​ రీ అసైన్​మెంట్ సర్జరీలు చేయించుకునేవారికి ఈ దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సెక్స్ టూరిజం కూడా ఇక్కడి ఆర్థిక వ్యవస్థలో ఓ భాగమే.


Also Read : సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే, శీతాకాలంలో ఈ సూప్ తాగండి