మనుషులంగా ఒకేలా ఉండరు. భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. కొందరు ఓపెన్ గా అన్ని మాట్లాడుతుంటారు. మరికొందరు అన్నీ మనసులోనే దాచుకుంటారు. కొందరు నలుగురిలో కలుస్తారు. మరికొందరు కలవరు. మనుషులను రెండు రకాలు చెప్పుకుంటారు. ఒకరు అంతర్ముఖులు (ఇంట్రావర్ట్), రెండు బహిర్ముఖులు (ఎక్స్‌ట్రావర్ట్). తాము ఏ కేటగిరీకి  చెందుతామో తెలియని వారికి ఈ వ్యక్తిత్వ పరీక్ష. ఇక్కడిచ్చిన ప్రశ్నలకు మీరిచ్చే సమాధానాలను బట్టి మీరు ఎలాంటి వారో నిర్ణయిస్తారు. 


1. మీరు ఒంటరిగా పార్టీకి వెళ్లడానికి ఇష్టపడతారా?
ఎ: అవును, ఖచ్చితంగా
బి: లేదు, నాకు కంపెనీ కావాలి.


2. మీ స్నేహితులు రాత్రిపూట బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు?
ఎ: నేను పార్టీలో భాగం కావడానికి ఇష్టపడతాను.
బి: నేను ఇంట్లోనే ఓటీటీలో సినిమాలు చూడాలనుకుంటాను.


3. మీరు ఏ రకమైన వీకెండ్‌ను ఇష్టపడతారు?
ఎ: స్నేహితులతో కలిసి వీకెండ్‌ను ఎంజాయ్ చేయడానికి
బి: ఇంట్లో ఉండేందుకు ఇష్టపడతా


4. నలుగురితో కలిసి కూర్చుని మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?
ఎ: ఇలాంటి మీటింగ్‌ల కోసం ఎదురు చూస్తాను.
బి: మీటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా అని చూస్తాను. 


5. కొత్త వ్యక్తులను కలవడం గురించి మీకు ఎలా అనిపిస్తుంది?
ఎ: చాలా ఆహ్లాదకరమైన అనుభవంగా అనిపిస్తుంది.
బి: నాకు ఆసక్తి ఉండదు.


6. మీరు ఎవరినైనా మొదటిసారి కలిసినట్లయితే, మీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది?
ఎ: వెంటనే  వారితో సంభాషణను ప్రారంభిస్తా
బి: వారు ఏదైనా చెబితే వింటా. 


7. ఖాళీ సమయములో ఏమి చేస్తారు?
ఎ: కొత్త వ్యక్తులను కలవడం, నలుగురితో కలిసి మాట్లాడడం.
బి: ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్‌తో మాట్లాడడం, లేదా సన్నిహిత కుటుంబంతో గడపడం. 


8. మీరు ఎక్కడ ఎక్కువ ప్రొడక్టవిటీని కలిగి ఉంటారు? 
ఎ: స్నేహితులతో కలిసి కేఫ్‌లో ఉన్నప్పుడు
బి: ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు


9. మీరు దేనిని ఎక్కువగా ఆనందిస్తారు?
ఎ: అందరి మధ్యలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా ఉండడం
బి: వెనుక నిలుచున్న బాగానే ఉంటుంది. 


10. కొత్త వ్యక్తులతో మీకు ఏమనిపిస్తుంది?
ఎ: సరదాగా అనిపిస్తుంది
బి: సమయం వృధా అనిపిస్తుంది.


ఫలితం ఇలా...


1. మీరు పైనిచ్చిన ప్రశ్నలలో ‘ఎ’ జవాబును ఎనిమిది నుంచి 10 సార్లు ఎంపిక చేసుకున్నట్టయితే బహిర్ముఖులు అని అర్థం. మీరు మనుషుల్లో ఉండడానికి ఇష్టపడే వ్యక్తి. అందరూ మీవైపు సులభంగా ఆకర్షితులవుతారు. మీరు నలుగురిలో ఉండి బాగా ఎంజాయ్ చేస్తారు. 


2. పైనిచ్చిన ప్రశ్నలలో ‘బి’ జవాబును ఎనిమిది నుంచి పది సార్లు ఎంపిక చేసుకున్నట్టయితే మీరు అంతర్ముఖులు అని అర్థం. మీరు నలుగురిలో, కొత్త వారితో కలిసేందుకు ఇష్టపడరు. కుటుంబసభ్యులతో లేదా కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ తోనే ఉంటారు. మీరు చాలా నమ్మకమైన వ్యక్తి. ఏ విషయాలు ఎవరి దగ్గరా బయటపెట్టరు. 


Also read: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు సీఫుడ్ అలెర్జీ ఉన్నట్టే - చేపలు, రొయ్యలు పక్కన పెట్టాల్సిందే