Horoscope Today 2nd November 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మీకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉండొచ్చు. నూతన పెట్టుబడులు పెట్టేమందుకు ఆలోచించండి. వ్యాపారులు జాగ్రత్త..ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. విద్యార్థులు ఇతర విషయాలపై ఆసక్తి తగ్గించుకోవాలి
వృషభ రాశి
ప్రియమైన వారితో ఉండటం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది. ఈ రాశికి చెందిన కొందరు నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీరు కూడా నష్టాన్ని చవిచూడవచ్చు. మీ సమయాన్ని వృధా చేసుకోకండి.
మిథున రాశి
ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు. తండ్రి సలహా మీకు ధనాన్ని ఇస్తుంది. వెంటనే ఎవరినీ నమ్మవద్దు. కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు. మీరు ఆలోచనాత్మకంగా పని చేస్తే ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది.
కర్కాటక రాశి
ఈ రోజు జీవిత భాగస్వామికి పెద్దగా ఉపయోగపడని అవసరాల కోసం ఖర్చు చేస్తారు.మీ సమయాన్ని ఇతరులకు కేటాయించడానికి ఇది మంచి రోజు...కానీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు. ఉన్నతాధికారుల, సహోద్యోగులు మద్దతు లభిస్తుంది..ఇది మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. నూతన ప్రణాళికల అమలుకు ఓ అడుగు ముందుకేయండి.
Also Read: నవంబరు 8 కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం, ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే!
సింహ రాశి
ఎవరి సహాయం లేకుండానే ఆర్థికంగా ఓ మెట్టు ఎక్కగలుగుతారు. సంపాదన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి బలం , అవగాహన ఉంటుంది. అందరితో మర్యాదగా, ఆహ్లాదకరంగా ప్రవర్తించడం సముచితంగా ఉంటుంది.
కన్యా రాశి
భూమి లేదా ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి రోజు అస్సలు కాదు...అందుకే ఆస్తికొనుగోలు అమ్మకాల విషయాలకు దూరంగా ఉండాలి. గృహ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి...లేదంటే మీ నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ రోజు ఎవరితోనైనా ఆకస్మిక సమావేశం మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇంటి నుంచి ఓ వార్త విని ఉద్వేగానికి లోనవుతారు.తగాదాలకు దూరంగా ఉండండి.
తులా రాశి
దీర్ఘకాలిక వ్యాధి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఈరోజు ధనలాభం పొందే అవకాశం ఉంది.దాన ధర్మాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. నూతన స్నేహితులు ఏర్పడతారు. మీరు ఈ రోజు కార్యాలయంలో మంచి అనుభూతి చెందుతారు.వ్యాపారస్తులు కూడా ఈరోజు వ్యాపారంలో లాభాలను ఆర్జించగలరు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు ఇచ్చిన పాత రుణాలు పొందవచ్చు. కొత్త ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు డబ్బులు సంపాదించే ప్లాన్ లో ఉంటారు. ఇతరుల జోక్యం ప్రతిష్టంభనకు దారి తీస్తుంది. మీరు పనిలో మంచి లాభాలను పొందుతారు. ఉదయం ఉన్న ఉత్సాహం సాయంత్రానికి ఉండదు
Also Read: నవంబరు నెల ఈ రాశులవారికి అనవసర ఖర్చులు, వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు
ధనుస్సు రాశి
ఈ రోజు రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రాశికి చెందిన కొందరు వ్యక్తులు డబ్బు గురించి ఆందోళన చెందుతారు. ఈ రోజు మీరు ఇష్టపడే వారి ద్వారా అపార్థాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
మకర రాశి
ఈ రోజు చేసే దానాలు మీకు మానసిక ప్రశాంతత, సాంత్వన చేకూరుస్తాయి. ఆర్థికంగా మంచి రోజు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు ఆకస్మికంగా అందిన కొన్ని శుభవార్తలు పెరుగుతాయి. మీరు ఈ రోజు చాలా బిజీగా ఉంటారు.
కుంభ రాశి
మీ ప్రవర్తన ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది.మీకు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో డబ్బు రావచ్చు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలులో బిజీగా ఉంటాను. నిరుద్యోగులు ఈరోజు మంచి ఉద్యోగం కోసం కష్టపడాల్సి వస్తుంది.
మీన రాశి
ఎప్పటి నుంచో మీరు కంటున్న అతి పెద్ద కల ఈ రోజు నిజం కావొచ్చు. ఆ విషయంపై సంతోషించండి లేదంటే మీరే ఇబ్బంది పడతారు. ఆకస్మిక లాభాల వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు కొంతమంది కొత్త స్నేహితులను పొందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామికి మీరు ఎంత విలువైనవారో అందమైన పదాలలో చెప్పే అవకాశం ఉంది.