Liver Cancer Symptoms : క్యాన్సర్ ప్రాణాంతకమైనదని అందరికీ తెలుసు. అయితే కాలేయ క్యాన్సర్ కూడా ప్రాణాంతక పరిస్థితే. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్యాన్సర్లలో ఇది కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఇది ఓ ప్రధాన కారణం. కాలేయ క్యాన్సర్ సాధారణంగా సిర్రోసిస్ లేదా హెపటైటిస్ వంటి దీర్ఘకాలిక కాలేయ రుగ్మతల వల్ల ఇబ్బంది పడుతున్న వారిలో వస్తుంది. అయితే ఇది అలాంటి వ్యాధులు లేనివారిలో కూడా వస్తుందంటున్నారు వైద్య నిపుణులు.
కాలేయ క్యాన్సర్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ప్రాథమిక కాలేయ క్యాన్సర్ అనేది కాలేయ కణాలలో ఏర్పడే క్యాన్సర్. ఇది అత్యంత సాధారణ రకం. ఇది హెపటోసైట్లో ప్రారంభమై.. ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. సెకండరీ లివర్ క్యాన్సర్ అనేది శరీరంలోని మరొక భాగం నుంచి కాలేయానికి వ్యాపిస్తుంది. క్యాన్సర్ కణాలు శరీరంలో ఎక్కడి నుండైనా కాలేయానికి వ్యాప్తి చెందుతాయి. కాలేయానికి వ్యాప్తించే అత్యంత సాధారణ క్యాన్సర్లు.. పెద్ద పేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్.
కాలేయ క్యాన్సర్‌కు ప్రమాద కారకాలివే..
కాలేయ క్యాన్సర్‌కు కచ్చితమైన కారణం చెప్పలేము కానీ.. అనేక ప్రమాద కారకాలున్నాయి. అవి వ్యాధిని అభివృద్ధి చేసే అవకాశాలను మెరుగుపరుస్తాయి. క్రానిక్ హైపటైటిస్ బి లేదా సి ఇన్పెక్షన్ సమస్యను పెంచుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీసి.. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. సిర్రోసిస్ వల్ల కూడా కాలేయ క్యాన్సర్‌కు ప్రధానకారణమవుతుంది. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల సిర్రోసిస్ వస్తుంది.
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డీసీజ్.. అనేది కాలేయంలోని అదనపు కొవ్వు వల్ల కలుగుతుంది.
ఊబకాయం, టైప్ 2 మధుమేహం వల్ల ఇది వచ్చే అవకాశముంది. మధుమేహం లేనివారికంటే.. మధుమేహం ఉన్న వ్యక్తులకు కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హీమోక్రోమాటోసిస్ అనే జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇది వస్తుంది. ఇది కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని మెరుగుపరుస్తుంది. విల్స్ వ్యాధి అనేది కూడా జన్యుపరమైన వ్యాధే. దీనివల్ల శరీరంలో కాపర్ ఎక్కువగా పేరుకుపోతుంది. ఇది కాలేయానికి హాని కలిగిస్తుంది. కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
కాలేయ క్యాన్సర్ లక్షణాలు
కాలేయ క్యాన్సర్ లక్షణాలు.. క్యాన్సర్ కణితి పరిమాణం, స్థానంపై ఆధారపడి ఉంటాయి. అలాగే ఏ స్టేజ్‌లో ఉన్నారనేదానిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. చాలామందిలో ఎలాంటి సంకేతాలు ఉండవు. అలాంటి వారిలో పరిస్థితి విషమించిపోతుంది. కానీ కొన్ని సంకేతాలు గుర్తించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. ఎగువ కుడి పొత్తికడుపులో నొప్పి, పొత్తికడుపులో ఉబ్బరం లేదా వాపు, కామెర్లు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, అలసట, వికారం, వాంతులు, జ్వరం, దురద, మూత్రంలో మార్పులు కాలేయం ఆరోగ్యం దెబ్బంతింటుందనడానికి సంకేతాలు.
మీరు ఈ క్యాన్సర్‌ను జయించాలనుకుంటే.. దానిని ముందుగా గుర్తించడం చాలా అవసరం. ఎలాంటి సంకేతాలు లేకపోయినా.. ఆరునెలలకోసారి ఫుడ్ బాడీ చెకప్ చేయించుకోండి. దీనివల్ల మీరు ఈ సమస్యను తర్వగా గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. శరీరంలో ఏ అవయవమైనా సమస్య వస్తే త్వరగా సంకేతాలు చూపిస్తుంది కానీ.. కాలేయం అలా కాదు. సమస్యను చాలా ఆలస్యం చేసి.. ప్రాణాల మీదకు తెస్తుంది. పైకి బాగానే ఉన్నట్లు అనిపించినా.. లోపలి నుంచి పరిస్థితిని దారుణంగా మార్చేస్తుంది.
Also Read : పిల్లల్లో స్పైనల్ స్ట్రోక్ వస్తుందా? ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్లాంటిదేనా?