భార్యాభర్తలు.. ప్రేమికులు పోట్లాడుకుంటున్నప్పుడు మధ్యలోకి దూరకూడదు. దాని వల్ల మధ్యలో దూరినవాడికే నష్టం. ఇందుకు ఈ స్విగ్గి డెలివరీ బాయ్ నిదర్శనం. ఇద్దరు ప్రేమికులకు రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించిన స్విగ్గి బాయ్. చివరికి సహనం కోల్పోయాడు. అంతా చూస్తుండగానే యువతిని చితక బాదాడు. అయితే, మిగతవాళ్లు ఎవరూ అతడిని ఏమీ అనలేదు. ఇందుకు కారణం.. ఆ యువతి ప్రవర్తనే అని నెటిజనులు అంటున్నారు. అసలు ఏం జరిగిందంటే..
ఒడిశాలోని భువనేశ్వర్‌లో గాంధీ పార్క్ వద్ద ఓ యువతి తన ప్రియుడితో పోట్లాడుతోంది. అతడు మాత్రం బైకు మీద కూర్చొని ఆమె తిడుతున్న బూతులు మౌనంగా వింటున్నాడు. ఆమె ఎన్ని తిట్టినా స్పందించలేదు. చివరికి ఆమె అతడిపై చేయిజేసుకున్నా.. కదలుకుండా అలాగే ఉన్నాడు. మరి, తప్పు ఎవరిదో తెలియదుగానీ.. ఆ యువతి మాత్రం చాలా కోపంగా ఉన్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ స్విగ్గి డెలివరీ బాయ్‌కు వీరిద్దరు కనిపించారు. ఇద్దరికీ రాజీ కుదుర్చుదామని అతడు మధ్యలోకి దూరాడు. అయితే, ఆమె తిట్లదండకం అందుకుంది. కాసేపు ఆమె తిట్లు బరించాడు. తర్వాత సహనం కోల్పోయి ఆమెను చితకబాదాడు. అతడు ఆమెను కొడుతుంటే, ప్రియుడు గానీ, స్థానికులు గానీ అడ్డుకోలేదు. అంతా అలా చూస్తుండిపోయారు. ఇదంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో ఇప్పుడు రెండు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక వీడియోలో ఆమె తన ప్రియుడిని తిడుతుంటే.. మరో వీడియోలో స్విగ్గి డెలివరీ బాయ్ ఆమెను కొడుతున్నాడు. ఈ వీడియో చూసి నెటిజనులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఆ స్విగ్గి బాయ్‌కు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమెను కొట్టి అతడు చాలా పెద్ద తప్పు చేశాడని, తప్పు ఆమె వైపు ఉన్నా సరే యువతిని అలా కొట్టడం మంచిది కాదని అంటున్నారు.
Also Read: నగ్న సందేశం, అంతరిక్షంలోకి ‘న్యూడ్’ చిత్రాలను పంపిస్తున్న నాసా, ఎందుకో తెలుసా?
అయితే, మౌనంగా ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ బుద్ధిమంతుడు కాదని, ఆమెను ప్రేమించి మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడని తెలుస్తోంది. అందుకే, ఆ యువతి అతడితో గొడవకు దిగిందని ఓ వార్త సంస్థ వెల్లడించింది. వారికి రాజీ కుదుర్చడానికి వచ్చిన స్విగ్గి బాయ్‌ను ఆమె అసభ్యకర పదజాలంతో తిట్టిందని, అందుకే అతడికి కోపం వచ్చి కొట్టాడని తెలిపింది. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయితే, ఈ వీడియో వైరల్ కావడంతో భువనేశ్వర్ డీసీపీ ఉమా శంకర్ దాస్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ జరపాలని స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఇరువురిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలివే.
Also Read: మాంసాహారం, ప్రోటీన్ షేక్స్ బాగా లాగిస్తున్నారా? పురుషులూ, ఇక పడక గదిని మరిచిపోండి!