చాలా స్వీట్ రెసిపీలు మీకు తెలుసు కదా, అలాగే ఇది ఒక టేస్టీ స్వీట్ రెసిపీ. చాలా సులువుగా చేసేయచ్చు. కొబ్బరిపాలతో చేసే స్వీట్ రైస్. పిల్లలకు చాలా నచ్చుతుంది. అంతేకాదు పండుగలకు నైవేద్యంగా కూడా దీన్ని పెట్టచ్చు. ఒక్కసారి దీన్ని తింటే మీరు మళ్లీ మళ్లీ తినాలని కోరుకుంటారు.
కావాల్సిన పదార్థాలుబియ్యం - పావు కిలోపంచదార - వంద గ్రాములుకొబ్బరి పాలు - 200 మి.లీపాలు - 100 మి.లీకుంకుమ పూవు - రెండు రేకులు కొబ్బరి క్రీమ్ - ఒక స్పూనుడ్రైఫ్రూట్స్ - గుప్పెడునెయ్యి - రెండు స్పూనులు
తయారీ ఇలా1. బియ్యాన్ని కాస్త నీళ్లు, కొబ్బరి పాలు వేసి సగం వరకు ఉడికించాలి. 2. సగం బియ్యం ఉడికాక పాలు, పంచదార, కుంకుమపూల రేకులు కూడా వేసి ఉడికించాలి. 3. చక్కని రంగు కోసమే కుంకుమ పూల రేకులు జత చేరుస్తాం. 4. అన్నం పూర్తిగా ఉడికాక పై కొబ్బరి క్రీమ్ తో గార్నిష్ చేయాలి. 5. డ్రైఫ్రూట్స్ ను నెయ్యిలో వేయించి పైన గార్నిష్ చేసుకోవాలి. 6. దీని వాసనే నోరూరించేస్తుంది. పిల్లలకు పెట్టేందుకు ఇది మంచి రెసిపీ. లంచ్ బాక్సుకు కూడా ఉపయోగపడుతుంది. 7. పంచదార వాడడం ఇష్టం లేకపోతే బెల్లాన్ని వాడుకోవచ్చు.
కొబ్బరి పాల ఉపయోగాలు1. కొబ్బరిపాలు చాలా ఆరోగ్యకరమైనవి. ఇవి ఎముకలకు చాలా బలాన్నిస్తాయి. కాల్షియం దీనిలో అధికంగా ఉంటుంది. 2. ఈ పాలలో కొవ్వును కరిగించే గుణాలు ఎక్కువ. కాబట్టి అధిక బరువు తగ్గాలనుకునే వారు దీన్ని మెనూలో చేర్చుకోవచ్చు. 3. వారానికోసారైనా కొబ్బరిపాలతో వండే వంటకాలను తినడం చాలా అవసరం. వీటిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి బయటి నుంచి శరీరంపై దాడి చేసే వైరస్, బ్యాక్టిరియాలతో పోరాడే శక్తిని అందిస్తుంది. 4. కొబ్బరిపాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే దీని వల్ల బరువు తగ్గడం సులువు. 5. ఈ పాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మన శరీరానికి మెగ్నీషియం చాలా అవసరం. 6. కొబ్బరిపాలతో జుట్టుకు మసాజ్ చేస్తే చాలా మంచిది. 7. ఈ పాలలో సెలీనియం అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చాలా సమస్యలకు చెక్ పెడుతుంది. నొప్పులు,క్యాన్సర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కొబ్బరి పాల వల్లే కాదు కొబ్బరి తురుముతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొబ్బరి ముక్కలు తినడం వల్ల విటమిన్ ఎ, బి, సి, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము, నియాసిన్, థయామిన్ లభిస్తాయి. కొబ్బరి తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి గుండె జబ్బులు కూడా రావు.