మహిళల్లో చాలా మందికి రుతుక్రమం సరిగా రాదని తరచూ వింటూనే ఉంటాం. ఒత్తిడి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, హార్మోన్స్ సమతుల్యంగా లేకపోవడం వంటి కారణాల వల్ల పీరియడ్స్ సక్రమంగా రావు. దాదాపు 33 శాతం మంది భారతీయ మహిళలు ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. సరైన టైమ్ కి ఆహారం తీసుకోవడంతో పాటు మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. మన రక్తప్రసరణ వ్యవస్థని సక్రమంగా ఉంచే పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. దీని వల్ల మన శరీరం ఫిట్ గా ఉండటమే కాక ఇతర ఆరోగ్య సమస్యల నుంచి మనకి ఉపశమనం లభిస్తుంది. మీకు నెలసరి సక్రమంగా రావాలంటే మే డైట్ లో వీటిని భాగం చేసుకోవడం ఉత్తమం.


బెల్లం


ఇంట్లో పెద్దలు చెప్పినట్లుగా బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. పీరియడ్స్ సరిగా రావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బెల్లం, కొద్దిగా అల్లం, నువ్వులు, చిటకెడు పసుపు, కొంచెం జీలకరను కలిపి ఒక ముద్దాలగా చేసుకుని తిన్నా లేదంటే ఒక కప్పు వేడి నీటిలో ఆ మిశ్రమాన్ని వేసుకుని తాగిన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా వారానికి రెండు, మూడు రోజులు చేస్తే చాలా మంచిది.


పసుపు


శరీరానికి రక్త ప్రసరణ బాగా జరగడానికి మన ఇంట్లో దొరికే చక్కటి మందు పసుపు. గోరు వెచ్చటి పాలల్లో కొద్దిగా పసుపు వేసుకుని తాగిన చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల హార్మోన్స్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. దీని వల్ల పీరియడ్స్ లో వొచ్చే నొప్పులు కూడా తగ్గుతాయి.


బొప్పాయి


పీరియడ్స్ సక్రమంగా రావడం లేదంటే చాలా మంది బొప్పాయి తినమని సలహా ఇస్తుంటారు. అది తినడం వల్ల వేడి చేసి మన శరీరంలో ఉన్న చెడు రక్తాన్ని బయటకి పంపేందుకు సహాయపడుతుంది. ఇది పీరియడ్స్ క్రమబద్దీకరించడంతో పాటు గర్భాశయ కండరాలు గట్టిపడే విధంగా చేస్తుంది. బాగా పండిన బొప్పాయి తినడం కంటే పచ్చిగా ఉన్న కాయ తినడం ఉత్తమం.


పైనాపిల్


పైనాపిల్ లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ రుతుక్రమాన్ని సక్రమంగా వచ్చేలా చేస్తుంది. పీరియడ్స్ సమయంలో పైనాపిల్ తీసుకోవడం వల్ల ఆ టైంలో వచ్చే బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో మాంగనీస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల మీకు  ప్రోటీన్స్, మినరల్స్, ఐరన్ పుష్కలంగాఉంటాయి.