Sunday Special Chicken Recipe : చపాతీల్లోకి, అన్నంలోనికి పర్​ఫెక్ట్​గా సెట్​ అయ్యే రెసిపీల్లో బటర్ చికెన్ ఒకటి. అయితే కొందరికి బటర్​, పాల ఉత్పత్తులు అంతగా పడవు. అలాంటివారు బటర్ కంటే టేస్టీ చికెన్ గ్రేవీని తయారు చేసుకోవచ్చు. అదే బాదం చికెన్ గ్రేవి. దీనిని తయారు చేయడం చాలా తేలిక. పైగా బాదం ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ రెసిపీ టేస్ట్​లో బటర్​ చికెన్​ను మించిపోతుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


చికెన్ - 500 గ్రాములు (బోన్ లెస్)


బాదం - 10


ఉల్లిపాయలు - అరకప్పు


టమాటాలు - 2 


గరం మాసాలా - అర టీస్పూన్


ధనియాల పొడి - అర టీస్పూన్


కారం - 1 టీస్పూన్


అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్


పెరుగు - 3 టేబుల్ స్పూన్


బిర్యానీ ఆకులు - 3


లవంగాలు - 4


యాలకులు -3


దాల్చిన చెక్క - 1 అంగుళం


ఉప్పు - తగినంత


తయారీ విధానం


ముందుగా చికెన్​ను మారినేట్ చేసుకోవాలి. చికెన్ ముక్కలను ఓ గిన్నెలోకి తీసుకుని దానిలో పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇలా మసాలా కలిపిన ముక్కలను అరగంట నుంచి గంట వరకు పక్కన ఉంచేయాలి. లేదంటే మీరు ముందు రోజు రాత్రి చికెన్​ను మారినేట్ చేసి దానిని ఫ్రిజ్​లో ఉంచవచ్చు. బాదంని కూడా ముందే నానబెట్టుకోండి. రెసిపీని తయారు చేసుకునే ముందు బాదంపై ఉన్న పీల్ తీసేసి మిక్సీలో చక్కని పేస్ట్ చేయాలి. 


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ ఉంచండి. దానిలో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడిచేయండి. ఇప్పుడు మసాలాలు వేసి.. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అవి కొంచెం వేగిన తర్వాత దానిలో ఉల్లిపాయలు వేసి అవి కాస్త వేగిన తర్వాత టమాటాలు వేసి మగ్గనివ్వండి. అనంతరం స్టౌవ్ ఆపేసి.. వాటిని చల్లారనివ్వండి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేయండి. 


స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టండి. దానిలో నూనె చికెన్​ను వేసి దానిని వేయించండి. చికెన్​లో నీరు పోయిన తర్వాత నూనె వేయండి. చికెన్ ముక్కలు గోల్డెన్ కలర్​లో వచ్చిన తర్వాత దానిలో మిక్సీ చేసుకున్న టమాట ప్యూరీని వేయండి. దానిలో కారం, ధనియాల పొడి. ఇప్పుడు అన్ని కలిసేలా బాగా కలిపి.. గ్రేవీని ఉడకనివ్వండి. గ్రేవీ కాస్త రెడ్​ కలర్ వస్తున్నప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ వేయండి. దీనిని బాగా కలిపి మరోసారి ఉడికించండి. 


చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత దానిలో గరం మసాలా వేసి మరోసారి తిప్పండి. చివరిగా కొత్తిమీర వేసుకుని స్టౌవ్ ఆపేయండి. అంతే వేడి వేడి బటర్ చికెన్ రెడీ. దీనిని మీరు రోటీలు, రైస్​లో కూడా కలిపి తీసుకోవచ్చు. బటర్ అంటే ఇష్టం లేని వారు హాయిగా దీనిని తయారు చేసుకుని చికెన్​ను ఎంజాయ్ చేయవచ్చు. 


Also Read : టేస్టీ, హెల్తీ కరివేపాకు పొడి రెసిపీ.. ఇలా చేస్తే నెలరోజులు నిల్వ ఉంటుంది