Summer Perfect Homemade Face Masks : వేసవిలో వేడి వల్ల, బయట తిరగడం వల్ల మీ స్కిన్ డల్‌గా, బ్లాక్‌గా మారుతుందా? అయితే పార్లల్‌కు వెళ్లకుండానే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే కొన్ని ఫేస్ మాస్క్‌లతో మీ చర్మానికి గ్లోయింగ్ స్కిన్‌ని అందించవచ్చు. ఇంట్లో రెగ్యులర్‌గా ఉండే కొన్ని వస్తువులతో మీరు వీటిని ట్రై చేయవచ్చు. ఇంతకీ గ్లోయింగ్నిచ్చే మాస్క్‌లు ఏంటి? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
టోమాటో, నిమ్మకాయ ఫేస్ మాస్క్
ఓ టమాటాను తీసుకుని దానిని ప్యూరీగా చేసుకోవాలి. దానిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. దీనిని బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాలు మాస్క్‌ని అలాగే ఉంచేసి.. చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఈ మాస్క్‌తో టాన్, డర్ట్ పోతుంది. స్కిన్ బ్రైట్‌గా మారుతుంది.
పసుపుతో ఫేస్ మాస్క్
మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసంలో ఓ టేబుల్ స్పూన్ పసుపు వేసి.. బాగా మిక్స్ చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి.. 20 నిమిషాలు ఉంచుకోవాలి. అనంతరం నీటితో కడిగేయాలి. ఈ మాస్క్‌తో మొటిమలు, మచ్చలు లేని స్కిన్ మీ సొంతమవుతుంది.
అరటిపండు, పెరుగు మాస్క్
అరటిపండును బాగా క్రష్ చేసి.. దానిలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు లేదా యోగర్ట్ వేసి.. ఓ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి.. డ్రై అవ్వనివ్వాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లని నీటితో వాష్ చేస్తే.. స్కిన్ సాఫ్ట్‌గా అవుతుంది. వారానికి రెండుసార్లు దీనిని ట్రై చేయవచ్చు.
బాదం ఫేస్ మాస్క్
4 లేదా 5 బాదంలను పాలలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటిపై తొక్క తీసి.. పేస్ట్‌గా చేసుకోవాలి. దీనిని ముఖానికి థిక్ లేయర్‌గా అప్లై చేయాలి. రాత్రి అప్లై చేసుకుని.. ఉదయాన్నే వాష్ చేసుకుంటే మంచిది. రేడియంట్, గ్లోయింగ్ ఫేస్కోసం ఈ మాస్క్‌ని రోజు విడిచి రోజు ట్రై చేయవచ్చు.
గుడ్డుతో ఫేస్ మాస్క్
గుడ్డును పగలగొట్టి దానిలో బాదం పౌడర్ వేయాలి. దీనిని బాగా కలిపి ముఖానికి, మెడకి అప్లై చేసి 20 నిమిషాలు ఉంచాలి. రాత్రుళ్లు ఈ మాస్క్ వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. డ్రై స్కిన్ ఉన్నవారికి ఇది చాలా బెస్ట్ ఫేస్ మాస్క్. పైగా ఇన్స్టాంట్ గ్లోని ఇస్తుంది.
ఆరెంజ్ ఫేస్ మాస్క్
టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్‌లో 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. దీనిని ముఖానికి అప్లే చేసి మసాజ్ చేయాలి. అనంతరం చల్లని నీటితో వాష్ చేసుకోవాలి. పార్టీలకు వెళ్లేముందు గ్లో కోసం ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయవచ్చు.
బొప్పాయి మాస్క్
బొప్పాయిని మాష్ చేసి.. దానిలో 1 టీస్పూన్ పాలు, 1 టేబుల్ స్పూన్ తేనె వేసి ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయాలి. డ్రై స్కిన్ వారికి ఇది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. బొప్పాయిలోని విటమిన్ ఏ, సి స్కిన్ హెల్త్‌ని ప్రమోట్ చేస్తుంది. డార్క్ స్పాట్స్ తగ్గి, మెరిసే స్కిన్ సొంతమవుతుంది.
పుచ్చకాయతో ఫేస్ మాస్క్
సమ్మర్లో పుచ్చకాయ బాగా దొరుకుతుంది. దీనిలో పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి.. సన్‌బర్న్ ప్రాంతంలో అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది మంటను, చికాకు తగ్గించి.. హెల్తీ స్కిన్‌ని ప్రమోట్ చేస్తుంది.
అలోవెరా జెల్, గ్లిజరిన్ మాస్క్
కలబంద గుజ్జులో కాస్త గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. పావుగంట తర్వాత దీనిని శుభ్రం చేస్తే ముఖానికి మంచి గ్లో వస్తుంది.
ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. ఈ మాస్కులను ట్రై చేసేముందు ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే మంచిది. అలాగే బ్యూటీ నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వీటితో పాటు స్కిన్ కేర్ రొటీన్‌ని ఫాలో అవుతూ ఉంటే స్కిన్ హెల్తీగా ఉంటుంది. హెల్తీ ఫుడ్‌ని తీసుకోవడంతో పాటు మినిమల్ మేకప్ స్కిన్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తుంది.
Also Read : మగవారికి స్కిన్ కేర్ రొటీన్.. హెల్తీ, మెరిసే చర్మం కోసం ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ ట్రై చేయొచ్చు