AAI Recruitment: న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో డైరెక్డ్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతోపాటు తగిన పని అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఏఏఐలో అప్రెంటిస్ శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులు, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 18లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.40,000-1,40,000 వరకు జీతంగా ఇస్తారు. 


వివరాలు.. 


* జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 83.


పోస్టుల కేటాయింపు: యూఆర్-39, ఈడబ్ల్యూఎస్-07, ఓబీసీ-21, ఎస్సీ-11, ఎస్టీ-05, 


విభాగాలవారీగా ఖాళీలు..


➥ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్‌ సర్వీస్‌): 13 పోస్టులు


➥ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్‌ రిసోర్సెస్‌): 66 పోస్టులు


➥ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్): 04 పోస్టులు


అర్హతలు.. 


➥ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్‌ సర్వీస్‌) పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ.


➥ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్‌ రిసోర్సెస్‌) పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు రెండేళ్ల ఎంబీఏ డిగ్రీ అర్హత ఉండాలి. ఎంబీఏలో హెచ్‌ఆర్‌ఎం/హెచ్‌ఆర్‌డీ/పీఎం&ఐఆర్/లేబర్ వెల్ఫేర్ స్పెషలైజేషన్లు ఉండాలి.


➥ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) పోస్టులకు పీజీ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్). డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్/హిందీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఇంగ్లిష్ నుంచి హిందీలోకి, హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువాదంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.


➥ సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: 18.03.2025 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోసడలింపు ఉంటుంది.


ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.


దరఖాస్తు ఫీజు: రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఏఏఐలో అప్రెంటిస్ శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.


జీత భత్యాలు: నెలకు రూ.40,000-1,40,000. మొత్తంగా 13 లక్షల వరకు వార్షిక వేతనం (సీటీసీ) ఉంటుంది. 


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభం: 17.02.2025.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 18.03.2025. 


Notification


Website


 


ALSO READ:


ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 246 ఉద్యోగాలు - ఈ అర్హతలు తప్పనిసరి!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మార్కెటింగ్ డివిజన్‌లో వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఆపరేటర్‌, జూనియర్‌ అటెండెంట్‌, జూనియర్ బిజినెస్‌ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీనిద్వారా మొత్తం 246 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిబ్రవరి 03న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..