Skin Care with Yogurt : సమ్మర్​లో మెరిసే చర్మం కావాలంటే మీరు నిరంతరం హైడ్రేటెడ్​గా ఉండాలి. నీరు, తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీటితో మీరు హైడ్రేటెడ్​గా ఉండాలి. ఈ ఎండలను తట్టుకోవాలంటే ఈ మాత్రం హైడ్రేటెడ్​గా లేకుండా ఆరోగ్యానికి, చర్మానికి కూడా మంచిది కాదు. కాబట్టి మీరు తీసుకునే చర్యలను బట్టి మీ స్కిన్​ హెల్తీగా ఉంటుందని గుర్తించుకోవాలి. చర్మ సంరక్షణకోసం బయటకు వెళ్లేప్పుడు సన్​స్క్రీన్ ఎలాగు పెట్టుకుంటారు. అయితే ఇంటికి వచ్చాక.. సన్​ టాన్​, ఇతర స్కిన్​ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


స్కిన్​ రక్షించడంలో పెరుగు లేదా యోగర్ట్​ ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటుంది. వివిధ సమస్యలకు.. దానిలో ఇతర సహజ పదార్థాలు జోడించి మీరు చర్మాన్ని రక్షించుకోవచ్చు. కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్​ వంటి విటమిన్లు, ఖనిజాలతో ఇవి సమృద్దిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. అంతేకాకుండా స్కిన్​ కేర్​లో కూడా ఇవి బెస్ట్​ రిజల్ట్స్ ఇస్తాయి. 


స్కిన్ కేర్ కోసం..


యోగర్ట్​లోని లాక్టిక్ యాసిడ్​ చర్మాన్ని సున్నితంగా ఎక్స్​ఫోలియేట్ చేయడంలో సహాయం చేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించడంలో సహాయం చేస్తుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా హెల్తీ స్కిన్​ను అందిస్తాయి. ఇవి చర్మంపై మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. దీనిలో జింక్​ చర్మంపై మంటను తగ్గిస్తుంది. రెగ్యూలర్​గా దీనిని ఉపయోగిస్తే మీ చర్మం మెరుస్తూ.. హెల్తీగా ఉంటుంది. అందుకే దీనిని స్క్రబ్​, మాస్క్​, టోనర్​, వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. 


ఫేస్ మాస్క్​


టేబుల్ స్పూన్ యోగర్ట్​లో తేనెను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. పావుగంట ఆరనిచ్చి.. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా స్కిన్​ ఇరిటేషన్​ను తగ్గిస్తుంది. 


బాడీ స్క్రబ్​


యోగర్ట్​లో ఓట్​మీల్​ కలిపి బాడీ స్క్రబ్​గా ఉపయోగించవచ్చు. ఇది మీ శరీరాన్ని ఎక్స్​ఫోలియేట్ చేయడమే కాకుండా చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మంపై ఉన్న మృతకణాలు, టాన్​ తొలగిపోతాయి. 


ఐ మాస్క్​


కీరదోస తురుమును యోగర్ట్​తో మిక్స్​ చేసి కంటి కింద భాగంలో అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాలు ఉంచి.. కంటి చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. కళ్లు ఉబ్బినా కూడా తగ్గి ఫ్రెష్​గా కనిపిస్తాయి. 


టోనర్​గా 


పెరుగులో టీస్పూన్ నిమ్మరసం కలపండి. దానిని మీ ముఖానికి కాటన్​తో అప్లై చేయండి. ఇది మీ చర్మం పీహెచ్​ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. జిడ్డును తొలగిస్తుంది. 


కలబందతో కలిపి కూడా దీనిని మీరు స్కిన్​ కేర్ కోసం ఉపయోగించవచ్చు. ఇది సన్​ టాన్, బర్నింగ్​ని తొలగించి ఉపశమనం ఇస్తుంది. సెన్సిటివ్ స్కిన్​ ఉన్నవారు ప్యాచ్ టెస్ట్ వేసుకుని తర్వాత వీటిని ట్రై చేయవచ్చు. 


Also Read : సమ్మర్​ అని కూల్​డ్రింక్స్ తాగేస్తున్నారా? అయితే జాగ్రత్త గుండెపోటు రావొచ్చట






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.