Heat Stroke First Aid Tips : ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మొదలైపోయాయి. ఏప్రిల్​ ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రానున్న రోజుల్లో ఎండల ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది అంటున్నారు వాతావరణ నిపుణులు. ఎండ తీవ్రత ఎక్కువైతే.. హీట్​ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శరీరం వేడిని తట్టుకోలేకపోయినప్పుడు ఇది వస్తుంది. ఆ సమయంలో శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. శరీరం చల్లబడుతుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా అవుతుంది. అయితే ఈ వడదెబ్బకు కారణాలు ఏంటి? వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


వడదెబ్బపై అవగాహన ఉండాలి..


వేడి ఎక్కువై.. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హీట్​ స్ట్రోక్ సమయంలో శరీరం ఉష్ణోగ్రత 10 నుంచి 15 నిమిషాలలో 106 డిగ్రీలు అంతకంటే ఎక్కువగా పెరిగిపోతుంది. ఆ సమయంలో అత్యవసర చికిత్స అందించకపోతే.. శాశ్వత వైకల్యం లేదా మరణానికి కారణమవుతుంది. అందుకే ఈ హీట్​ స్ట్రోక్​ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి అంటున్నారు. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలు, ఆఫీస్​లు, పనులకు వెళ్లేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. 


హీట్ స్ట్రోక్ లక్షణాలు


వడదెబ్బ ప్రమాదాలను తగ్గించాలంటే ముందు దాని లక్షణాలు గుర్తించాలి. అప్పుడు నివారణ చర్యలు అమలు చేయడం చాలా ముఖ్యం. హీట్ స్ట్రోక్ సమయంలో శరీర ఉష్ణోగ్రతలు మారిపోతూ ఉంటాయి. కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేయదు. గందరగోళం, చిరాకు, మతిమరుపు, మానసిక స్థితిలో మార్పులు వడదెబ్బ లక్షణాలే. చెమట పట్టదు. చర్మం పొడిబారిపోయి.. వేడిగా మారిపోతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం అత్యంత ప్రమాదకరమైన లక్షణం. తలనొప్పి, మైకము, మూర్ఛ కూడా దీనిలో భాగమే. వాంతులు, వికారం, విరేచనాలు వంచి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 


వడదెబ్బ నివారణ చర్యలు


ఇలాంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే నివారణ చర్యలు ఫాలో అవ్వాలి. డీహైడ్రేషన్​ను పోగొట్టేందుకు తగినంత నీటిని తీసుకోవాలి. ఎండ నుంచి నీడలోకి వెళ్లిపోవాలి. దీనివల్ల డీహైడ్రేషన్​ కంట్రోల్ అవుతుంది. ఫ్యాన్స్, ఏసీ వంటి వాటి దగ్గర కాసేపు కూర్చోవాలి. శరీరంలోపలి వేడి బయటకు వెదజల్లగలిగే దుస్తులు ధరించాలి. వైట్, కాటన్ దుస్తులు సమ్మర్​లో సౌకర్యంగా ఉంటాయి. ఇవి మీ శరీరానికి గాలి ఆడేలా చేస్తాయి. బయటకు వెళ్లి చేసే పనులకు బ్రేక్ ఇస్తే మంచిది. ఎండ తగ్గాక మీ పనులు చేసుకుంటే మరీ మంచిది. వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. వైద్యుల సలహాలు తీసుకోవాలి. వడదెబ్బతో ఇబ్బంది వ్యక్తిపై చల్లని దుస్తులు వేసి.. అతనిని నీడకు తీసుకెళ్లాలి. గాలి ఆడేలా చూసి.. మంచి నీటిని అందిచాలి. ఇలాంటి జాగ్రత్తలతో వడదెబ్బ నుంచి వ్యక్తి ప్రాణాలు కాపాడవచ్చు. 


Also Read : సమ్మర్​లో కచ్చితంగా తీసుకోవాల్సిన విటమిన్లు ఇవే.. లేకుంటే ఆ సమస్యలు తప్పవు








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.