Brahmamudi Serial Today Episode: రాహుల్, రుద్రాణిని తిట్టినట్లు నాటకం అడతాడు. అనామిక చూడాలని రాహుల్ ఇంకా గట్టిగా రుద్రాణిని తిడుతుంటాడు. నువ్వసలు తల్లివేనా అంటూ కోప్పడతాడు. అది గమనించిన అనామిక రాహుల్‌ను ఏంటిది తల్లితో ఇలాగేనా మాట్లాడేది అంటుంది. దీంతో నా బాధ నీకు అర్థం కాదులే అనామిక అంటూ రాహుల్ వెళ్లిపోతాడు. రుద్రాణి బాధపడుతుంది. కళ్యాణ్ ఎండీ అయ్యాడు. కనీసం నన్ను మేనేజర్‌ను అయినా చేయమని అడుగుతున్నాడు అంటూ రుద్రాణి బాధపడుతుంది. దీంతో రాహుల్ అడిగన దాంట్లో న్యాయం ఉంది కదా అని అనామిక చెప్తుంది. కళ్యాణ్ ను ఒప్పించి రాహుల్‌ను మేనేజర్‌ను చేసే బాధ్యత నాది అంటూ హామీ ఇస్తుంది అనామిక. ఇప్పుడే కాదు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు రూంలో రాజ్ బాబు ఏడుస్తుంటే ఆడిస్తూ ఉంటాడు.
రాజ్: ఊరుకోరా పాలు వస్తున్నాయి. అమ్మ రానివ్వు.. అమ్మ వస్తుంది. ఎత్తుకుంటుంది. పాలు ఇస్తుంది. ఏడవకు నాన్న ఏడవకు అమ్మ వచ్చేస్తుంది.
కావ్య: హలో మాస్టారు ఎమన్నారు అమ్మనా? నేను అమ్మనా.. ? ఎవరికి అమ్మనయ్యాను. ఎప్పుడు అయ్యాను. మీరు కన్న బిడ్డకు నన్ను తల్లిని చేస్తారా? మరి వాడి తల్లిని ఎం చేస్తారు. మీరు ఏం అయినా చేసుకోండి నన్ను అమ్మా అని ఎలా పరిచయం చేస్తారు. ఇంకోసారి నన్ను అమ్మా అంటే ఊరుకునేదే లేదు. కాఫీ
రాజ్: నాకా.. చల్లారిపోయిందా?
కావ్య: కోపమా?
రాజ్: కాదు కాఫీ..
రాజ్ కాఫీ తాగుతుంటే వెన్నెల గురించి ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటుంది కావ్య. ఇంతలో తన ఫ్రెండ్ తప్పిపోయిందని తను ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఏం చేయాలని రాజ్‌ను అడుగుతుంది. ఎందుకు తప్పిపోయిందని అడగ్గానే దాని మొగుడు కూడా నీలాగే బిడ్డను తీసుకొచ్చి నీలాగే చేశాడని అది తట్టుకోలేక పోయిందని చెప్పగానే సోషల్ మీడియాలో వెతకమని రాజ్ చెప్పి ఇంతకీ మీ ఫ్రెండ్ పేరు ఏంటని అడగ్గానే పున్నమి అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత అందరూ హల్లో కూర్చుని ఉండగా లాయర్ అక్కడికి వస్తాడు.
సుభాష్: ఈ ఇంట్లో మిమ్మల్ని రమ్మని ఎవరైనా పిలిచారా?
రాజ్: నేనే రమ్మన్నాను.
సుభాష్: రాజ్ ఇప్పుడు లాయర్ గారితో అవసరం ఏముంది.
రాజ్: చాలా ఉంది డాడీ..
ప్రకాశం: ఆ చాలా అవసరం ఎవరికుంది?
రాజ్: ఈ ఇంటికి ఈ ఇంటి సభ్యులకు మన కంపెనీకి అక్కడ స్థానాలకు
అపర్ణ: రాజ్ ఎప్పుడూ లేనిది ఈ ఇంటికి లాయర్ గారు వచ్చారంటే నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఈ ఇంటికి లాయర్ గారితో ఎప్పుడూ అవసరం రాకూడదని కోరుకునే సభ్యురాలిగా చెప్తున్నాను. నీ మనసులో ఏమైనా ఉంటే ముందుగా మాతో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకో..
రాజ్: ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు మమ్మీ మీరంతా కలిసి ఆమోదించిందే..! మీ నిర్ణయాన్ని నేను సమ్మతించాను అంతే
ఇందిరాదేవి: ఎంట్రా ఆ నిర్ణయం ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోవడం అమలు చేయడం మొదలుపెడితే ఈ ఇంట్లో పెద్దరికం ఏమైనట్టు
అనగానే నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం ఏం కాదు ఇది. నా ప్లేస్ లో కూర్చున్న కళ్యాణ్‌కు లీగల్‌గా అన్ని పవర్స్ ఇవ్వబోతున్నాను అందుకే లాయర్ గారిని రమ్మనాను అనగానే అనామిక, ధాన్యలక్ష్మీ హ్యాపీగా ఫీలవుతారు. మిగతా అందరూ షాక్ అవుతారు. అనామిక మాత్రం కళ్యాణ్‌తో ఒక్క చెక్కుమీద సంతకం తీసుకున్నానంటే నా పుట్టింటి అప్పులన్నీ తీరిపోతాయి అని మనసులో అనుకుంటుంది. మరోవైపు అందరూ కలిసి రాజ్ మనసు మార్చాలని చూస్తారు. ఒక బిడ్డ కోసం అన్ని వదులుకోవడం ఎందుకు అంటూ కావ్య నిలదీస్తుంది. ఇప్పటికైనా ఆ బిడ్డ పుట్టుక వెనక ఉన్న నిజాన్ని అందరి ముందు చెప్పండి అని కోరుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫేస్ చూసుకోమని కామెంట్ చేశారు... కట్ చేస్తే నేషనల్ అవార్డు కొట్టాడు!