Benefits of Vitamins : వేసవి వచ్చేసింది. తెలుగురాష్ట్రాల్లో ఎండలు దంచేస్తాయంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ.. ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని విటమిన్లు కచ్చితంగా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శక్తి వినియోగం ఎక్కువగా ఉండి.. శరీరం నుంచి అవసరమైన విటమిన్లు కోల్పోతాము. అందుకే కొన్ని విటమిన్లు రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే సమ్మర్​లో శరీరానికి అందించాల్సిన విటమిన్లు ఏంటో.. వాటిని ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


విటమిన్ ఎ


వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. పొడి వాతావరణం లేదా తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. మండే ఎండ శరీరాన్ని డీహైడ్రేషన్​కు గురిచేస్తుంది. అలసటను కలిగిస్తుంది. యూవీ కిరణాలు, సూర్యరశ్మి వల్ల చర్మానికి నష్టం కలుగుతుంది. ఈ సమయంలో విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచుతాయి. చర్మాన్ని కాపాడుతాయి. 


విటమిన్ బి


వేసవికాలంలో విటమిన్ బి తీసుకోవడం చాలా అవసరం. సమ్మర్​లో హృదయ సమస్యలు రాకుండా.. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది హెల్ప్ చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి.. నాడీ వ్యవస్థకు మద్ధతు ఇస్తుంది. సమ్మర్​లో శక్తిని పునరుత్తేజింపజేస్తుంది. 


విటమిన్ సి


సమ్మర్​లో కలిగే స్కిన్ సమస్యలను దూరం చేయడంలో విటమిన్ సి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. 


విటమిన్ డి


శరీరం, అవయవాలు సజావుగా పనిచేయడాకి, బోన్స్ హెల్తీగా ఉండడానికి విటమిన్ డి బాగా హెల్ప్ చేస్తుంది. ఇది గుండె పనితీరు, రోగనిరోధశక్తిని మెరుగుపరుస్తుంది. కండరాల పనితీరును హెల్తీగా చేస్తుంది. కొన్ని ఫుడ్స్, ఉదయాన్నే ఎండద్వారా దీనిని పొందవచ్చు. 


విటమిన్ ఇ


ఇది శరీరానికి, చర్మానికి కూడా అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్​గా పనిచేస్తుంది. ఇది సూర్యుని నుంచి, యూవీ కిరణాల నుంచి మీ చర్మం, జుట్టును రక్షిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీరాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి తగ్గిస్తాయి. ఒత్తిడి, టాక్సిన్స్, వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయం చేస్తాయి. 


విటమిన్ కె


రోగనిరోధక శక్తిని కాపాడుకోవడంలో, ఎముకల ఆరోగ్యాన్ని బిల్డ్ చేయడంలో విటమిన్ కె బాగా సహాయం చేస్తుంది. రక్తం గడ్డకట్టడానికి ఈ విటమిన్ చాలా అవసరం. 


అందుకే వేసవిలో హెల్తీగా, విటమిన్లు పుష్కలంగా ఉండే విటమిన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మీ హెల్తీ డైట్​లో ఈ విటమిన్స్ ఉండేలా కచ్చితంగా ఉండేలా చూసుకోండి. వీటితో పాటు శరీరానికి తగినంత నీటిని అందిచాలని గుర్తించుకోవాలి. ఇది మొత్తం ఆరోగ్యానికి, చర్మానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. 


Also Read : డేటింగ్ యాప్స్ వినియోగిస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకు కచ్చితంగా హెల్ప్ అవుతాయి..







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.